Viral News: ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
Kerala: ఉద్యోగుల్ని కుక్కుల్నిచూసినట్లుగా చూస్తోంది ఓ కంపెనీ. టార్గెట్ సాధించకపోతే వారికి కుక్కబెల్టులు కట్టి శిక్షిస్తున్నారు. ఈ వీడియో సంచలనం అయింది.

Brutal cruelty towards employees: సమాజం ఆధునికంగా మారుతున్న కొద్దీ.. అనాగరికంగా మారే వారూ పెరిగిపోతున్నారు. కేరళలోని ఓ కంపెనీ యజమానులు తమ ఉద్యోగులను మనుషులుగా చూడటం లేదు. కుక్కలుగా చూస్తున్నారు. అది కూడా చూపులతోనే కాదు.. చేతలతో కూడా..
కేరళలోని కొచ్చిలో హిందూస్థాన్ పవర్ లింక్స్ అనే కంపెనీలో ఉద్యోగులను కుక్కల మాదిరిగా వేధిస్తున్నారు. కంపెనీలో టార్గెట్లను సాధించని ఉద్యోగులపై మానేజర్ క్రూరంగా వ్యవహరించినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాియి. ఉద్యోగులను వారిని కుక్కల బెల్ట్‌తో కట్టి, నాలుగు కాళ్లపై నడిపించడం, నాణేలను నోటితో తీయమని బలవంతం చేయడంతో పాటు కుక్కలు చేసే పనులను చేయాలని ఉద్యోగుల్ని ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#numberoneKerala employees of Hindustan Power link made to walk like dogs and made to lick coin from the floor with belt on neck for not achieving target@sambitswaraj @amitmalviya @AmitShah pic.twitter.com/WkuoqDeuQ5
— pParambathp (@PParandy) April 5, 2025
హింసకు గురైన వారంతా మార్కెటింగ్ ఉద్యోగులు. వారంతా డోర్ టు డోర్ వెళ్లి కంపెనీై వస్తువులను అమ్మాల్సిన ఉద్యోగంలో ఉన్నారు. ఆ రోజు టార్గెట్లు సాధించలేని వారికి ఇలాంటి శిక్ష విధిస్తారు. తర్వాత రోజు కుక్కబతుకు బతకకుండా ఉండాలంటే టార్గెట్లు రీచ్ అయి వస్తారని కంపెనీ యాజమాన్యం భావన అని చెబుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితులు భయపడుతున్నారు. స్పందించడం లేదు. వీరంతా పదివేల లోపు జీతానికి పని చేస్తున్నవారే.
ടാർഗറ്റ് അച്ചീവ് ചെയ്യാത്തവർക്ക് ക്രൂര പീഡനം ; കൊച്ചി ഹിന്ദുസ്ഥാൻ പവർ ലിങ്ക്സിൽ തൊഴിലാളികളെ പട്ടി ബെൽറ്റിട്ട് നടത്തിച്ചുhttps://t.co/ls90R892y2 pic.twitter.com/0XRRAyaXUL
— Livy @ ☭ Antifascist🌹 (@Ras_hmi_Tweet) April 5, 2025
ఈ కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో కేరళ లేబర్ మినిస్టర్ వి. శివన్‌కుట్టి వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. కంపెనీ యజమాని గతంలో లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన వ్యక్తి అని గుర్తించారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్యోగుల హక్కులపై చర్చ ప్రారంభమయింది. అయితే, కంపెనీ యజమాని ఈ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనకు తమ కంపెనీకి సంబంధం లేదని పోలీసులకు చెప్పారు.కానీ ఆయన అబద్దం చెబుతున్నారని స్పష్టంగా తెలిసిపోతోందని అంటున్నారు.
Keltro group, a perumbavoor based company forces marketing employees do a doggie walk and makes them lick coins spread on the floor. That was for not meeting charges https://t.co/Q0qknBwQT0 In Kerala there is labour militancy among loading workers. But other workers suffer
— A. Harikumar (@journalistHari) April 5, 2025




















