అన్వేషించండి

Bangladesh: బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో హిందువులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు.

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేశారు. షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయిప్పటి నుంచి ఆందోళనకారులు హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఆలయాలు ధ్వంసం చేశారు. హిందువు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న హిందువులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. బంగ్లాదేశ్ రాజధాని ధాకాతో పాటు చిట్టగాంగ్‌లో లక్షలాది మంది హిందువులు ర్యాలీ చేశారు.  పలు జిల్లాల్లో వీళ్లపై దాడులు జరుగుతున్నాయి. వేలాది మంది హిందువులు ఈ దాడులు తట్టుకోలేక భారత్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందువులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంతే కాదు. పార్లమెంట్‌లో మైనార్టీలకు  10% సీట్లు కేటాయించాలనీ డిమాండ్ చేస్తున్నారు.

మైనార్టీల హక్కులకు రక్షణ కల్పించేలా కొత్త చట్టాలు తీసుకురావాలనీ నినదించారు. హిందువులకు మద్దతుగా వేలాది మంది ముస్లింలూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పలు చోట్ల రోడ్‌లు బ్లాక్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 7 లక్షల మంది ఈ ర్యాలీ చేశారు. అటు అమెరికా, బ్రిటన్‌లోనూ ఇదే స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. (Also Read: Viral News: లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్, వీడియో రికార్డ్ అవుతుండగా చూసి షాకైన మహిళ)

ఈ ర్యాలీలపై ఆపద్ధర్మ ప్రధాని మహమ్మద్ యూనస్ స్పందించారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులపై దాడులు జరగకుండా చూసుకోవాలని, వాళ్ల కుటుంబాల్ని రక్షించాలని కోరారు. వాళ్లూ ఈ దేశ పౌరులే అన్న విషయం మరిచిపోవద్దని అన్నారు. 

"వాళ్లు మాత్రం బంగ్లాదేశ్ పౌరులు కాదా..? ఇంత పోరాటం చేసి దేశాన్ని రక్షించుకున్నారు. వాళ్ల కుటుంబాల్నీ కాపాడలేరా..? ఎవరూ వారిపై దాడులు చేయడానికి వీల్లేదు. ఇదే విషయం మీరు అందరికీ చెప్పండి. వాళ్లంతా మన కుటుంబ సభ్యులే. వాళ్లూ మనకోసం పోరాటం చేశారు. అంతా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం ఇది"

- మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధాని

బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు సద్దుమణగడం లేదు. దాదాపు నెల రోజులుగా అక్కడ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. షేక్ హసీనా ఇంటినీ ముట్టడించారు. వెంటనే ఆమె అక్కడి నుంచి ఇండియాకి వచ్చారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈ అల్లర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనక అమెరికా హస్తం, షేక్ హసీనా స్పీచ్‌లో సంచలన విషయాలు

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget