అన్వేషించండి

Viral News: లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్, వీడియో రికార్డ్ అవుతుండగా చూసి షాకైన మహిళ

Bengaluru: బెంగళూరులోని ఓ కాఫీ షాప్‌లో వాష్‌రూమ్‌లో మహిళ మొబైల్‌ని గుర్తించింది. డస్ట్‌బిన్‌లో పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు కనిపెట్టింది. ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Viral News in Telugu: బెంగళూరులోని ఓ పాపులర్ కాఫీ షాప్‌లో మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్‌ కనిపించింది. ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి వెళ్లారు. అప్పటికే రెండు గంటల పాటు వీడియో రికార్డ్ అయినట్టు ఆ మహిళ గుర్తించింది. బీఈఎల్ రోడ్‌లోని Third Wave Coffee ఔట్‌లెట్‌లో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది. ఔట్‌లెట్‌లో ఏం జరిగిందో వివరిస్తూ ఈ పోస్ట్‌ పెట్టారు యూజర్. వాష్‌రూమ్‌లో మొబైల్ చూసి ఆ మహిళ ఎంత కంగారు 
పడిపోయిందో ఈ పోస్ట్‌లో వివరించారు. (Also Read: Viral News: గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ పోల్ పట్టుకున్న బాలుడు, ఎలక్ట్రిక్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి)

"బెంగళూరులోని థర్డ్‌ వేవ్ కాఫీ ఔట్‌లెట్‌లో ఉన్నాను. ఆ సమయంలోనే ఓ మహిళకు వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్ కనిపించింది. ఫోన్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా అందులో దాచిపెట్టారు. దాదాపు 2 గంటల పాటు వీడియో రికార్డ్ అయింది. ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టడం వల్ల అక్కడ మొబైల్ ఉన్నట్టు ఎవరికీ తెలియలేదు. కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్‌ బిన్‌కి ఓ రంధ్రం పెట్టారు. ఆ మహిళ ఇది గుర్తించి సిబ్బందికి చెప్పింది. అక్కడ పని చేస్తున్న ఉద్యోగి ఈ పని చేసినట్టు తేలింది. పోలీసులు వెంటనే వచ్చి ఆ వ్యక్తిని విచారించారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు"

- ఇన్‌స్టా పోస్ట్‌ 

ఇంత కన్నా దారుణం ఇంకేం ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపై ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే..ఈ ఘటనపై థర్డ్ వేవ్ ఔట్‌లెట్ వెంటనే స్పందించింది. X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి వాటిని అసలు సహించమని, ఇకపై జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. ఆపై క్షమాపణలూ చెప్పింది. ఆ ఉద్యోగిని వెంటనే జాబ్ నుంచి తొలగించినట్టు తెలిపింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్‌లోనూ వాష్‌రూమ్స్‌లో కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసిన ఘటనలు నమోదయ్యాయి. తరచూ ఎక్కడో ఓ చోట మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. బయట వాష్‌రూమ్స్ యూజ్ చేయాలంటేనే భయం వేస్తోందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇంత పెద్ద స్టోర్స్‌లోనూ ఇలాంటి దారుణాలు జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

Also Read: Viral News: బ్యాగ్‌లో బాంబు ఉందంటూ ప్యాసింజర్ బెదిరింపులు, ఎయిర్‌పోర్ట్‌లో హై అలెర్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget