అన్వేషించండి

Bangladesh: బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనక అమెరికా హస్తం, షేక్ హసీనా స్పీచ్‌లో సంచలన విషయాలు

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ అల్లర్ల వెనక అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె రాసుకున్న స్పీచ్‌లో అగ్రరాజ్యంపై విరుచుకు పడ్డారు.

Bangladesh Crisis: ప్రధాని పదవికి రాజీనామా చేయక ముందు షేక్ హసీనా బంగ్లాదేశ్ పౌరులను ఉద్దేశించి ఓ ప్రసంగం చేయాలనుకున్నారు. స్పీచ్ రెడీ కూడా చేసుకున్నారు. కానీ...అంతలోనే ఆందోళనకారులు ఒక్కసారిగా ముట్టడి చేయడం వల్ల అప్పటికప్పుడు వెంటనే ఇండియాకి బయల్దేరి వచ్చారు. అయితే...ఈ స్పీచ్‌లోని అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ సంక్షోభం వెనక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు షేక్ హసీనా. ఇదే విషయాన్ని తన ప్రసంగం ద్వారా అందరికీ చెప్పాలనుకున్నారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఈ స్పీచ్‌ కాపీలోని అంశాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సెయింట్ మార్టిన్ ఐల్యాండ్‌ని ( Saint Martin Island) అమెరికాకి అప్పగించి ఉంటే బంగ్లాదేశ్‌లో ఇదంతా జరిగేదే కాదని అందులో పేర్కొన్నారు షేక్ హసీనా. అంతే కాదు. బే ఆఫ్ బెంగాల్‌పై అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకుని ఉంటే ఈ సంక్షోభం తలెత్తేది కాదని స్పష్టం చేశారు. అమెరికా కారణంగానే ఇంత విధ్వంసం జరిగిందని తేల్చి చెప్పారు. విద్యార్థుల శవాలతో రాజకీయాలు చేయాలని చూశారని మండి పడ్డారు. 

"ఇంత మంది చనిపోతుంటే చూడలేక నేను ప్రధాని పదవికి రాజీనామా చేశాను. విద్యార్థుల శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూశారు. కానీ..నేను అదంతా జరగనివ్వలేదు. అందుకే వెంటనే పదవి నుంచి తప్పుకున్నాను. ఒకవేళ సెయింట్ మార్టిన్ ఐల్యాండ్‌ సార్వభౌమాధికారాన్ని అమెరికాకి అప్పగించి తలొంచి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బే ఆఫ్ బెంగాల్‌పై అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకున్నందుకే ఇంత సంక్షోభం సృష్టించారు. ఇలాంటి అతివాదులు ఏవేవో చెప్పి ఉసిగొల్పుతూనే ఉంటారు. మీరు మాత్రం ఆ వలలో పడొద్దు"

- షేక్ హసీనా స్పీచ్‌లోని అంశాలు

బంగ్లాదేశ్‌కి దక్షిణాన బే ఆఫ్ బెంగాల్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సెయింట్ మార్టిన్ ఐల్యాండ్. దీనిపై అమెరికా ఆధిపత్యం చెలాయించాలని చూసిందని, అందుకు ఒప్పుకోలేదనే ఇంత విధ్వంసం సృష్టించిందని షేక్ హసీనా ఆరోపించారు. ఇంకా తను అక్కడే ఉండి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉండే వాళ్లని, ఆ మారణహోమాన్ని చూడలేకే రాజీనామా చేశానని ఆ స్పీచ్‌లో వివరించారు. తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

"దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు. నేను తప్పకుండా తిరిగి వస్తాను. నేను ప్రస్తుతానికి ఓడిపోయి ఉండొచ్చు. కానీ బంగ్లాదేశ్ మాత్రం గెలిచింది. ఈ ప్రజల కోసమే నా నాన్న, కుటుంబం ప్రాణాలు అర్పించింది"

- షేక్ హసీనా

దేశవ్యాప్తంగా అల్లర్లు ఉద్ధృతం కావడం వల్ల ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హుటాహుటిన అక్కడి నుంచి భారత్‌కి వచ్చారు. మోదీ సర్కార్ ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతానికి ఇండియాలోనే ఉన్న ఆమె యూకే, అమెరికాకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ..ఈ రెండు దేశాలూ ఆమెపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అయితే...ఆమె కొడుకు సాజీబ్ మాత్రం త్వరలోనే మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతారని చెబుతున్నారు. 

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Animal Park Update : 'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget