Owaisi On Hijab Row: 'నేను టోపీతో పార్లమెంటుకు వెళ్లినప్పుడు- వాళ్లు హిజాబ్‌తో కళాశాలకు ఎందుకు వెళ్లకూడదు?'
పార్లమెంటుకు తాను టోపీ పెట్టుకుని హాజరైనప్పుడు.. ముస్లిం యువతులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు ఎందుకు వెళ్లకూడదని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
కర్ణాటకలో మొదలై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన హిజాబ్ వివాదంపై ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్తే తప్పేంటని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
యూపీ మోరాదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింల హక్కులు హరించవద్దని ఓవైసీ కోరారు.
సుప్రీం నో..
మరోవైపు హిజాబ్ అంశంపై కేసు విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి అత్యవసర బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.
ఇదే వివాదం..
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో.. జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 67,084 మందికి వైరస్