News
News
X

Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో- జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య

హిజాబ్‌ వివాదంపై విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు అత్యవసర బదిలీకి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

FOLLOW US: 
Share:

హిజాబ్​ అంశంపై కేసు విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి అత్యవసర బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్​ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.

చెలరేగిన వివాదం.. 

హిజాబ్ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. కర్ణాటకలో పాఠశాలలు, కళాశాలలు హిజాబ్ వివాదం కారణంగా మూసివేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ అంశమై సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు కోరడం లేదని కేవలం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ కేసును కర్ణాటక హైకోర్టు విచారిస్తుండటంతో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.

కర్ణాటక హైకోర్టు..

ఈ వివాదంపై బుధవారం విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రితురాజ్​ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మరోసారి విచారించనుంది.

అంతకుముందు  జస్టిస్ క్రృష్ణ దీక్షిత్ ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. విస్తృత ధర్మాసనమే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

హిజాబ్ వివాదం..
 
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. నెల రోజుల నుంచి ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా ఉంది. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.

మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ర్యాలీలు చేశారు.

Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 67,084 మందికి వైరస్

Published at : 10 Feb 2022 02:35 PM (IST) Tags: supreme court karnataka high court hijab row Karnataka Hijab Row Karnataka Hijab Issue

సంబంధిత కథనాలు

RBI Governor: బ్యాడ్‌ టైమ్‌ వెళ్లిపోతోందట, గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌

RBI Governor: బ్యాడ్‌ టైమ్‌ వెళ్లిపోతోందట, గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్‌ విమానం, సుఖోయ్-మిరాజ్ హెలీకాప్టర్లు

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్‌ విమానం, సుఖోయ్-మిరాజ్ హెలీకాప్టర్లు

Stock Market Update: రెండ్రోజుల్లో రూ.11 లక్షల కోట్ల నష్టం, వచ్చే వారం మార్కెట్‌ను నడిపించేది ఇవే!

Stock Market Update: రెండ్రోజుల్లో రూ.11 లక్షల కోట్ల నష్టం, వచ్చే వారం మార్కెట్‌ను నడిపించేది ఇవే!

UP Crime News: భర్త నాలుకను కొరికి పడేసిన భార్య, అసలేం జరిగిందంటే?

UP Crime News: భర్త నాలుకను కొరికి పడేసిన భార్య, అసలేం జరిగిందంటే?

Ratha Saptami Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు - సూర్యప్రభ వాహనంతో మొదలు!

Ratha Saptami Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు - సూర్యప్రభ వాహనంతో మొదలు!

టాప్ స్టోరీస్

నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!

నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!

Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?

Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?

Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి

Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి

Mahesh Babu : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?

Mahesh Babu : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?