Hero Destini 125: రాజమౌళి బాహుబలి స్టైల్ లో స్కూటీ ప్రమోషన్! ఫీచర్లు, ధర, ఇతర వివరాలు
125 సీసీ స్కూటీ విభాగంపై కన్నేసిన హీరో మోటోకార్ప్.. డైరెక్టర్ రాజమౌళీతో జట్టు కట్టింది. డెస్టినీ స్కూటీకీ తనను ప్రచారకర్తగా నియమించుకుంది. బాహుబలి థీమ్ తో ఈ యాడ్ నిర్వహించారు.

Hero MotoCorp Destini Scooty Latest Bike News: బైకుల విభాగంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు దక్కించుకున్న హీరో మోటో కార్ప్ తాజాగా స్కూటీ విభాగంపైన దృష్టి సారించింది. 125 సీసీ విభాగం స్కూటీలలో అగ్రభాగాన్ని దక్కించుకునేందుకు భారీ కసరత్తు చేసింది. తాజాగా, హీరో మోటోకార్ప్ తన లేటేస్ట్ వేరియంట్ డెస్టిని 125 స్కూటర్ కోసం కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన (TVC)ను ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ డైరెక్టర్ SS రాజమౌళి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాహుబలి చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజమౌళి, ఆ సినిమా థీమ్ తోనే ఈ స్కూటీ యాడ్ లో నటించడం విశేషం. బాహుబలి చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని, స్కూటీ ద్వారా హీరో తన ప్రయాణాన్ని ఎలా జరిపాడో ఉత్కంఠభరితంగాఈ యాడ్ లో తెరకెక్కించారు. చివర్లో హీరో డెస్టినీ 125 “హీరో కా స్కూటర్, స్కూటర్ కా హీరో” అనే శీర్షికతో రాజమౌళీ చెప్పిన డైలాగ్ అదరిఇపోయింది.
The moment the curtain rises, the hero arrives.
— sambitpatra (@sambitpatra852) August 16, 2025
Hero Destini 125 makes that moment larger than life.
This is not an ad, this is pure cinema on wheels.#HeroDestini125 pic.twitter.com/ay4X7pc5bF
గ్రాండ్ స్కేల్లో..
రాజమౌళిని ఎంపిక చేయడం ద్వారా, హీరో తన బాహుబలి ఖ్యాతిని ఉపయోగించి స్కూటీ గ్రాండ్ నెస్ ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇక పండుగ సీజన్ డిమాండ్ సమీపిస్తున్నందున, ఈ యాడ్ తమ అమ్మకాలను మరింతగా పెంచుతుందని , పోటీ 125cc విభాగంలో స్కూటీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని హీరో మోటోకార్ప్ ఆశిస్తోంది.
3 వేరియెంట్లలో లభ్యం..
హీరో డెస్టినీ 125 మూడు వేరియంట్లలో లభిస్తుంది.. ZX+, ZX, VX . ధర సుమారు రూ. 81,000 నుండి రూ. 92,000 వరకు ఉంటుంది. ఇందులో ZX+లో పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, DTE (డిస్టెన్స్-టు-ఖాళీ), ఆటో-క్యాన్సిల్ వింకర్లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్, సీట్ బ్యాక్‌రెస్ట్ మరియు కాపర్-క్రోమ్ యాక్సెంట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. . ధర రూ. 91,700
ఇక ZX కూడా ZX+ లాగానే ఉంటుంది కానీ కాపర్ క్రోమ్‌కు బదులుగా వేరే క్రోమ్ ఉంటుంది. ధర రూ. 90,700, మూడోది VX మోడల్లో డిజి-అనలాగ్ మీటర్, డ్రమ్ బ్రేక్‌లు, క్రోమ్ యాక్సెంట్‌లు , కాస్ట్ డ్రమ్ వీల్స్‌తో ఉంటుంది. ధర రూ. 81,850. ఇందులో వేరియంట్‌ను బట్టి పోలార్ వైట్, స్టీల్ గ్రే, కాస్మో బ్లూ, పెర్లా నేరా బ్లాక్, గార్నెట్ రెడ్ మరియు డ్యూయల్-టోన్ స్కీమ్‌లలో కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.
హీరో డెస్టినీలోని ముఖ్యమైన ఫీచర్లు.. ఇంజిన్: 124.6cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ SI ఇంజిన్ .. పవర్: 9 bhp @ 7000 rpm .. టార్క్: 10.4 Nm @ 5500 rpm .. ట్రాన్స్మిషన్: డ్రై సెంట్రిఫ్యూగల్ క్లచ్ తో CVT .. సస్పెన్షన్: టెలిస్కోపిక్ ఫోర్క్ (ముందు), సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ (వెనుక) .. బ్రేక్లు: ముందు డిస్క్ (ZX+, ZX), డ్రమ్ (VX) CBS తో .. .. ఇంధన ట్యాంక్: 5.3 లీటర్లు.





















