Gujrat Elections: గుజరాత్‌లో స్పీడ్ పెచ్చిన ఆప్- కేజ్రీవాల్‌పై రాయితో దాడి!
Gujrat Elections: గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడు.
Gujrat Elections: ఆమ్ ఆద్మీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగినట్లు ఆప్ తెలిపింది. అయితే కేజ్రీవాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వెల్లడించింది.
రోడ్ షోలో
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన సూరత్‌లో సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఎవరో కేజ్రీవాల్‌పై రాయి విసిరారు. ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు.
కేజ్రీవాల్‌పై చేసిన దాడిలో ఓ చిన్నారి గాయపడినట్లు ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా తెలిపారు. భాజపా గూండాలే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. మరోవైపు కేజ్రీవాల్‌పై దాడి జరగలేదని గుజరాత్ పోలీసులు తెలిపారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతతో రోడ్‌షో జరిగిందన్నారు.
మోదీ విమర్శలు
ఎన్నికల హామీల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ.. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిపై మోదీ స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.
డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.
Also Read: Shraddha Murder Case: అఫ్తాబ్‌పై హత్యాయత్నం- పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి కత్తులతో!