Gujarat, HP Election 2022 Dates: మోగనున్న నగారా- ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడే విడుదల!
Gujarat, HP Election 2022 Dates: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు ప్రకటించనుంది ఈసీ
Gujarat, HP Election 2022 Dates: కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించనుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు ప్రకటించనుంది.
Election Commission of India to hold a press conference later today, in Delhi. The election schedule of Assembly elections to Gujarat and Himachal Pradesh to be announced. pic.twitter.com/Xd2NGdfnmQ
— ANI (@ANI) October 14, 2022
ఎలక్షన్ హీట్
హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో.. నాలుగో వందే భారత్ ట్రైన్‌ను గురువారం ఇక్కడి నుంచే ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించిన తరవాత...ప్రధాని ఓ సభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు తీర్చని సమస్యల్ని భాజపా తీర్చుతోందని, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటోందని వెల్లడించారు.
అని వెల్లడించారు. తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని..త్వరలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ఉన్న బల్క్ డ్రగ్ పార్క్‌లో రూ.2వేల కోట్ల పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే తయారయ్యే అవకాశం కల్పిస్తే మందులు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
గుజరాత్‌లో
మరోవైపు రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు షాక్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ వ్యూహాలు రచిస్తోంది. ఆప్‌ను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని కేజ్రీవాల్ అన్నారు. పలు హామీలు ప్రకటించారు.
- 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
- రాబోయే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తాం
- అందరికీ ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి
- 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తాం.
- ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ కాకుండా చూడటంతో పాటు ఇందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకువస్తాం.
Also Read: J&K Police Terminated: 36 మంది పోలీసులపై ప్రభుత్వం వేటు, అవినీతికి పాల్పడితే అంతే మరి