News
News
X

Gujarat Results 2022: ఆమ్‌ఆద్మీకి భారీ షాక్- 19 వేల ఓట్ల తేడాతో సీఎం అభ్యర్థి ఓటమి

Gujarat Results 2022: ఆమ్‌ఆద్మీ గుజరాత్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గద్వీ 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

FOLLOW US: 
Share:

 Gujarat Results 2022: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆమ్ ఆద్మీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రస్తుతం కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. మరోవైపు  పార్టీ సీఎం అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఇసుదాన్ గ‌ద్వి కూడా ఓట‌మి పాల‌య్యారు.

ఖాంభ‌లియా స్థానం నుంచి పోటీ చేసి సుమారు 19 వేల ఓట్ల తేడాతో ఇసుదాన్ ప‌రాజ‌యాన్ని చ‌వి చూశారు. భాజపా అభ్య‌ర్థి అయ్య‌ర్ ములుభాయ్ హ‌ర్ధ‌స్‌భాయ్ బేరా చేతిలో ఆయ‌న ఓట‌మి చెందారు. మూడ‌వ స్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి అర్జ‌న్‌భాయ్ ఉన్నారు.

జర్నలిస్ట్

ప్రస్తుతం AAP నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఇసుదాన్ గద్వీ.. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన గద్వీ జామ్ ఖంభాలియాలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కామర్స్‌లో పట్టభద్రుడయ్యాక, 2005లో గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం చదివారు.

ఆ తర్వాత దూరదర్శన్‌లో చేరి అక్కడ ఓ షో చేశారు. తర్వాత పోర్‌బందర్‌లోని 'ఈటీవీ గుజరాతీ' ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. 2015లో ఈశుదాన్ అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ గుజరాతీ ఛానెల్​కు ఎడిటర్ అయ్యారు. 'మహామంథన్' పేరుతో ఓ షోను ప్రారంభించిన గద్వీ​.. అందులో యాంకర్​గా వ్యవహరించారు. ఈ షోతో ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది.

 

Published at : 08 Dec 2022 03:54 PM (IST) Tags: Gujarat Elections 2022 Gujarat Election 2022 Election Results 2022

సంబంధిత కథనాలు

Minister Harish Rao :  వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు

Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం-  ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

IND vs NZ: రెండో టీ20 జరిగే లక్నో గ్రౌండ్ ఎలా ఉంది? - వర్షం పడుతుందా?

IND vs NZ: రెండో టీ20 జరిగే లక్నో గ్రౌండ్ ఎలా ఉంది? - వర్షం పడుతుందా?