News
News
X

Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు కెప్టెన్ వరుణ్ సింగ్.

FOLLOW US: 

సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతోన్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగళూరు కమాండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఇదే ప్రమాదం..

డిసెంబర్​ 8న మధ్యాహ్నం తమిళనాడు సూలూర్​ ఎయిర్​బేస్​ నుంచి వెల్లింగ్టన్​లోని సైనిక కళాశాలకు సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మరో 11 మంది ​అధికారులు వెళుతున్న క్రమంలో కూనూర్​ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్​ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను బెంగళూరు తరలించి చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడి ఆయన కూడా కన్నుమూశారు.

శౌర్య చక్ర..

వరుణ్​ సింగ్​ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్​ డిఫెన్స్​)లో విధులు నిర్వహించారు. వరుణ్​ సోదరుడు తనూజ్​.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్​ కమాండర్​. వరుణ్​ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్​లో.. ఆయన నడుపుతున్న తేజస్​ విమానంలో గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది.

ఆ సమయంలో వరుణ్​.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్​ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.

Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు

Also Read: చాక్లెట్ ఇస్తానని మతిస్తిమితం లేని యువతిపై వృద్ధుడి లైంగిక దాడి.. మరో బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

Also Read: Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 15 Dec 2021 12:56 PM (IST) Tags: Group Captain Varun Singh lone survivor TamilNadu Chopper Crash bengaluru hospital Captain Varun Singh Death

సంబంధిత కథనాలు

Bhadrachalam: గోదావరి మళ్లీ ఉప్పొంగుతున్న గోదావరి, మూడో ప్రమాద హెచ్చరిక జారీ - ఈ రూట్స్ అన్నీ బంద్

Bhadrachalam: గోదావరి మళ్లీ ఉప్పొంగుతున్న గోదావరి, మూడో ప్రమాద హెచ్చరిక జారీ - ఈ రూట్స్ అన్నీ బంద్

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

Poonam Kaur On Bilkis Bano Case : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?

Poonam Kaur On Bilkis Bano Case : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?

AIADMK GC Meet: అన్నాడీఎంకేకు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్, ఆ మీటింగ్ చెల్లదని వ్యాఖ్యలు

AIADMK GC Meet: అన్నాడీఎంకేకు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్, ఆ మీటింగ్ చెల్లదని వ్యాఖ్యలు

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

టాప్ స్టోరీస్

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

Bigboss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?

Bigboss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?

Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్‌ల ఆవేదన

Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్‌ల ఆవేదన

Karthikeya 2 Box Office Collection : నిఖిల్ కెరీర్‌లోనే టాప్ - వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేసిన 'కార్తికేయ 2'

Karthikeya 2 Box Office Collection : నిఖిల్ కెరీర్‌లోనే టాప్ - వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేసిన 'కార్తికేయ 2'