G20 summit 2022: భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలు- ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం!
G20 summit 2022: వచ్చే ఏడాది జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష పగ్గాలను భారత్‌కు అప్పగించింది ఇండోనేసియా.
G20 summit 2022: ఇండోనేసియా బాలీలో జీ20 సదస్సు బుధవారం ముగిసింది. దీంతో 2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు ఇండోనేసియా అప్పగించింది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారు.
Indonesian 🇮🇩 President Joko Widodo "HAND OVER #G20 PRESIDENCY TO INDIA 🇮🇳"@narendramodi#G20 #G20India #G20Indonesia pic.twitter.com/GNziUlIt5r
— G20 India (@G20_India) November 16, 2022
భారత్ నేతృత్వంలో
వచ్చే ఏడాది జరిగే జీ20 సమావేశాలకు భారత్ నేతృత్వం వహించనుంది. అధికారికంగా డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనుంది.
Indonesian President @jokowi symbolically hands over #G20 Presidency to Prime Minister Shri @narendramodi .
— G Kishan Reddy (@kishanreddybjp) November 16, 2022
India 🇮🇳 formally assumes G20 Presidency from 1st December this year.
PM Modi said: India's G20 presidency will be inclusive, ambitious, decisive and action-oriented. pic.twitter.com/2W8bu9wXRw
లోగో ఆవిష్కరణ
భారత జీ-20 లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోదీ నవంబర్ 8న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. డిసెంబర్ 1 నుంచి జీ-20కి భారత్ అధ్యక్షత వహిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారతదేశానికి ఒక చారిత్రక సందర్భం అన్నారు. లోగోలో ఉన్న తామర పువ్వు పౌరాణిక వారసత్వాన్ని గుర్తుగా మోదీ వివరించారు.
జీ-20 అనేది ప్రపంచ జీడీపీలో 85% ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల సమూహం. ఇది ప్రపంచ వాణిజ్యంలో 75% ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం ఇప్పుడు ఈ జీ-20 సమూహానికి నాయకత్వం వహించబోతోంది.
Also Read: UK Visa: మోదీతో భేటీ తర్వాత- భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి సునక్!