అన్వేషించండి

Viral News: ఫ్లిక్స్ బ‌స్ బంప‌ర్ ఆఫ‌ర్ రూ. 99ల‌కే బెంగ‌ళూరు-హైద‌రాబాద్ బ‌స్సు ప్ర‌యాణం. 

Bengaluru News | బెంగ‌ళూరు- హైద‌రాబాద్ సిటీల మ‌ధ్య కేవ‌లం రూ. 99ల‌కే ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్టు ఫ్లిక్స్ బ‌స్సు పేర్కొంది. ఈనెల 10 నుంచి వ‌చ్చే నెల 6వ తేదీ వ‌ర‌కు ఆప‌ర్ వ‌ర్తింపజేశారు.

FLIX Bus bumper Offer మ‌న‌దేశంలో అత్యంత చౌక‌గా ప్ర‌యాణించాలంటే రైల్లో వెళ్ల‌డం ఒక్క‌టే మార్గం. అది కూడా ఇటీవ‌ల కాలంలో చార్జీలు పెరిగిన కార‌ణంగా ఖ‌ర్చుతో కూడుకున్న‌దే అవుతోంది. రిజ‌ర్వేష‌న్ లేకుండా రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ బోగీల్లో ప్ర‌యాణించాలంటే చాలా ఇబ్బంది ప‌డాలి. రైళ్ల‌కు రెండే జ‌న‌ర‌ల్ భోగీలు ఉండ‌టంతో వాటిల్లో వెళ్లాలంటే ప్రయాణికుల‌కు దేవుడు క‌నిపిస్తాడు. గ‌తంలోలా ఎక్కువ భోగీలు ఉండ‌టం లేదు. రిజ‌ర్వేష‌న్ చేసుకుందాం అంటే టికెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి. వేల‌కు వేలు చెల్లించి బ‌స్సుల్లో ప్ర‌యాణించాలి. బ‌స్సుల్లో స్లీప‌ర్ క్లాస్ టికెట్లు కొనాలంటే వేల‌కు వేలు పోయాలి. అలాంటిది బిజీగా ఉండే రూట్ల‌లో ఇంట‌ర్ సిటీ ప్ర‌యాణం చేయాలంటే వీకెండ్స్‌లో టికెట్లు దొర‌క‌డం కూడా అంత ఈజీ కాదు. బెంగ‌ళూరు- హైద‌రాబాద్ నిత్యం ర‌ద్దీగా ఉండే మార్గం. రెండు న‌గ‌రాలు సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు డెస్టినేష‌న్ సిటీస్ కావ‌డంతో నిత్యం ఈ మార్గాల్లో అప్ప‌టిక‌ప్పుడు టికెట్లు దొర‌క‌డం అంత ఈజీ కాదు. ఇక వీకెండ్స లో అంటే.. గ‌గ‌నమ‌నే చెప్పాలి.. 

సెప్టెంబ‌ర్ 10 నుంచి ఫ్ర‌యాణం షురూ..

హైద‌రాబాద్-బెంగ‌ళూరు సిటీల మ‌ధ్య దాదాపు 600 కిలో మీట‌ర్ల దూరం ఉంది. అయితే ఈ రెండు సిటీల మ‌ధ్య కేవ‌లం రూ. 99 ల‌కే బ‌స్సు ప్ర‌యాణం అందించ‌నున్న‌ట్టు ఫ్లిక్స్ బ‌స్ ప్ర‌క‌టించింది. స్టార్టింగ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా సంస్థ ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో సేవ‌ల‌ను విస్త‌రిస్తున్న‌ట్టు ఆ సంస్త ప్ర‌తినిధులు పేర్కొన్నారు. ముంద‌గా బెంగ‌ళూరు- హైద‌రాబాద్, బెంగ‌ళూరు- చెన్నై మ‌ధ్య స‌ర్వీసుల‌ను ప్రారంబించింది. సెప్టెంబ‌ర్ 10 నుంచి అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు రూ. 99 ల చార్జీల‌తోనే ప్రయాణ సౌకర్యం క‌ల్పిస్తున్న‌ట్టు ఆ కంపెనీ తెలిపింది. సెప్టెంబ‌ర్ 10 నుంచే సంస్థ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వుతున్నాయ‌ని తెలిపింది. భ‌విష్య‌త్తులో ద‌క్షిణ భార‌త‌దేశంలోనే కోయంబ‌త్తూర్‌, మ‌ధురై, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, బెళ‌గావికి త‌మ సేవ‌ల‌ను విస్త‌రిస్తామ‌ని కంపెనీ పేర్కొంది. 

ఈ సంస్థ ఇప్ప‌టివ‌ర‌కు 6 బ‌స్ ఆప‌రేట‌ర్ల‌తో భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది. త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌తోపాటు ద‌క్షిణ భార‌త‌దేశంలో 33 న‌గ‌రాల్లో మొత్తం 200 భాగ‌స్వామ్యాల‌తో స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని సంస్థ పేర్కొంది. కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలు, మౌలిక మంత్రి ఎంబీ పాటిల్‌ బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై మార్గాల్లో మంగళవారం బస్సులకు సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌మోష‌న్ కార్యక్రమంలో గ్లోబల్‌ ఫ్లిక్స్‌ సీఓఓ మ్యాక్స్‌ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్‌ క్రాస్‌ పాల్గొన్నారు.

Also Read: TGSRTC News: ఏపీ వెళ్లేవారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్, ఈ రూట్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget