By: ABP Desam, Vijaya Sarathi | Updated at : 29 Jun 2023 07:10 AM (IST)
జగన్, సోనియా మీటింగ్‌కు 13 ఏళ్లు- అసలు ఆ రోజు ఏం జరిగింది?
29 జూన్ 2010 ..ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం10 జనపథ్. పూర్తి భద్రతతో ఉండే ఆమె నివాసంలోకి అనుమతి లేనిదే ఎంత పెద్ద పార్టీ లీడర్‌కైనా ప్రవేశం ఉండదు. అయితే అప్పటి కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయ, చెల్లెలు షర్మిలతోపాటు సోనియా గాంధీని కలుస్తున్నారు అనే వార్త రావడంతో జాతీయ మీడియా మొత్తం అక్కడ మోహరించింది.
అనుకున్నట్టుగానే హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న జగన్ కనీసం ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి సైతం వెళ్ళ కుండా డైరెక్ట్‌గా సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన అభిమానులు కుటుంబాలను పరామర్శిస్తా నంటూ జగన్ మొదలు పెట్టిన ఓదార్పు యాత్ర అప్పటికే తెలంగాణలో ఒక జిల్లా, ఆంధ్రలో ఒక జిల్లాలో జరిగింది. అయితే పార్టీ హైకమాండ్ నుంచి ఈ యాత్రకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బ్రేక్ పడింది. తాత్కాలికంగా యాత్రను పోస్ట్ ఫోన్ చేసిన జగన్‌తో ఢిల్లీ హైకమాండ్ ప్రతినిధులు పలుమార్లు చర్చించారు. అప్పటి ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్, వైఎస్ సన్నిహితుడు వీరప్ప మొయిలీ నుంచి హైకమాండ్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా ఉన్న సంగతి జగన్‌కు తెలిసింది. అలాగే ఒకసారి ఢిల్లీ వచ్చి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలవాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు అందాయి. దాంతో ఢిల్లీకి జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో సహా బయలుదేరారు
సోనియా నివాసంలో 40 నిమిషాల చర్చ - 15 నిమిషాల వెయిటింగ్
ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో ఆమెను కలిసే ముందు జగన్‌ను 10 నుంచి 15 నిమిషాలపాటు వెయిట్ చేయించారని జగన్ సన్నిహితులు చెబుతారు. అనంతరం సోనియా గాంధీని కలిశారని... ఆమె మాట్లాడుతూ "ఓదార్పు యాత్ర ఆపి వేయాలని. కావాలంటే వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలతో జిల్లా కేంద్రాల్లో మీటింగ్ పెట్టి చెక్కులు అందజేయాలని" సూచించారు. అయితే ఎవరైనా చనిపోతే ఇంటికి వెళ్లి పరామర్శించడం సంప్రదాయమని, దీనిపై తాను ఆల్రెడీ బాధిత కుటుంబాలకు మాట ఇచ్చేసానని జగన్ సోనియాకు తెలిపారు.
ఎన్ని చెప్పినా ఓదార్పు యాత్ర మాత్రం వద్దని సోనియా ఖరాఖండిగా చెప్పడంతో జగన్ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లిపోయారనేది జగన్ ఆంతరంగీకులు చెప్పే మాట. ఆ తరువాత అక్కడే ఉన్న విజయ యాత్ర గురించి సోనియాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. దాన్ని షర్మిల ఇంగ్లీష్‌లో ట్రాన్సలేట్ చేసి వివరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో వారు కూడా ఆ గది నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి 10 జన్ పద్ వెనుక వైపు నుంచి కారులో వెళ్లిపోయారు.
ఆ సంఘటనతో మీటింగ్ అనుకూలంగా జరగలేదని ఆ రోజే కథనాలు వెలువడ్డాయి. వీరప్ప మొయిలీ లాంటి కీలక నేతలు కూడా జగన్ మనసులో ఏముందో అంతు బట్టడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ మొదలైన ఓదార్పు యాత్ర
ఈ సమావేశం పై ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వని జగన్ 9 రోజుల గ్యాప్‌లో 8 జులై 2010 నుంచి తన ఓదార్పు యాత్ర మళ్లీ మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా వైఎస్ వ్యతిరేక వర్గంగా పేరుపడ్డ వర్గం జగన్ పై బాహాటంగానే విమర్శలు మొదలు పెట్టారు. గాంధీ కుటుంబానికి వీరభక్తుడిగా పేరున్న వీ.హనుమంతరావురావు అయితే ఇందిరా, రాజీవ్ చనిపోయినప్పుడు కూడా ఇంతమంది చనిపోలేదు వైఎస్ కోసం మాత్రం ఎలా చనిపోయారు అంటూ ప్రశ్నించారు. ఇది కేవలం జగన్ వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తున్న ప్రచారం అంటూ ఆరోపణలు చేశారు.
జగన్, కాంగ్రెస్ బంధాన్ని తెంపేసిన ఒక్క ఆర్టికల్.." హస్తగతం"
ఎన్ని విభేదాలు ఉన్నా అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన పత్రిక సాక్షిలో 19 నవంబర్ 2010 న ఒక ఆర్టికల్ " హస్తగతం " పేరుతో పబ్లిష్ అయింది. సాక్షి టీవీలో కూడా టెలికాస్ట్ అయిన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ హై కమాండ్ ఎలా ప్రాభవాన్ని కోల్పోతోందో వివరిస్తూ జగన్ అంతరంగాన్ని బయట పెట్టింది. ఈ కథనం కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టించింది. యాంటి-జగన్ వర్గం వెంటనే ఈ ప్రోగ్రామ్‌ను రికార్డ్ చేసిన సీడీలను హై కమాండ్‌కు అందజేశారు. దీనిపై పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే నాటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి సాక్షి టీవీలో వచ్చిన కథనాలపై విచారం వ్యక్తం చేస్తూ హై కమాండ్‌కి విధేయత ప్రకటించారు. ఈ వరుస పరిణామాల ఫలితంగా అందరూ ఊహించినట్లే 29 నవంబరు 2010న జగన్మోహన్ రెడ్డి 5 లేఖను పార్టీకి రాస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆయన తల్లి విజయ కూడా పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జగన్,విజయ ఉపఎన్నికల్లో గెలవడం, సొంత పార్టీ అనౌన్స్ చెయ్యడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. నిజంగా ఆలోచిస్తే 13 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఒక్క మీటింగ్ మొత్తం తెలుగు రాజకీయాల్ని మార్చేసింది అని చెప్పవచ్చు.
ఓదార్పు యాత్రకు సోనియా నో చెప్పడానికి రీజన్??
సోనియా గాంధీ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వక పోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి అంటారు ఎనలిస్టులు. మొదటగా ఆ టైంలోనే తెలంగాణ మలిదశ ఉద్యమం బలంగా మొదలైంది. తెలంగాణలో ఉప ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. అప్పుడే ఓదార్పు యాత్ర పార్టీకి నష్టం చేస్తుంది అని కాంగ్రెస్ భావించింది. ఓదార్పు యాత్ర పేరుతో జగన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటున్నారు తప్ప పార్టీకి మద్దతుగా సాగడం లేదన్న రిపోర్ట్స్ ఉన్నాయి. వైఎస్ లాంటి బలమైన నేత మరణంతో చెల్లాచెదురైన పార్టీలో యాత్రల పేరుతో జగన్ మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని హై కమాండ్ భావించింది అంటారు. వీటన్నింటి దృష్ట్యా ఓదార్పు యాత్రకు సోనియా నో చెప్పారని విశ్లేషణలు పొలిటికల్.
మరోవైపు రామ్‌గోపాల్ వర్మ కూడా వ్యూహం పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఇది కూడా రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ఏం చేశాడనే అంశాన్ని బేస్ చేసుకొని తీస్తున్న సినిమా. మరి అందులో ఈ ఎపిసోడ్ ఉంటుందా అనేది ఆసక్తి నెలకొంది.
Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు
Telangana Election Results 2023: జోరు చూపుతున్న కాంగ్రెస్, జిల్లాల వారిగా ఇలా
Kavitha on Election Counting: మళ్లీ అధికారం మాదే - ఓట్ల కౌంటింగ్ సరళిపై స్పందించిన కవిత
Telangana Election Results: తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ ఆలస్యమయ్యే ఛాన్స్ - ఎందుకో కారణం చెప్పిన వికాస్ రాజ్
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
/body>