Taiwan Fire Accident: 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. 46 మంది మృతి
తైవాన్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 46 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాహ్సిఅంగ్ నగరంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Breaking News: At least 46 people died in a building fire in Taiwan. The structure housed low-income and older residents, and had deteriorated in recent years. https://t.co/TzfutHCeBu
— The New York Times (@nytimes) October 14, 2021
ఏం జరిగింది?
గురువారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. నగరంలోని 13 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయింది.
At least 46 people died and dozens were injured after a major fire broke out in a building in southern Taiwan, authorities said. https://t.co/nch7jhkXjt
— CNN (@CNN) October 14, 2021
భవనం మొత్తం మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి నాలుగు గంటల సమయం పట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అక్కడే మొదలు..
భవనంలో అస్తవ్యస్తంగా సామగ్రి పడి ఉన్నచోటే మంటలు వ్యాపించినట్లు అధికారికంగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ అగ్ని ప్రమాద తీవ్రతకు భవనంలోని పలు అంతస్తులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కింద షాపింగ్ కాంప్లెక్స్లు, పైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
అయితే అగ్నిప్రమాదానికి ముందు పెద్ద పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు
Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'
Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం