Pakistan: ఇండియా జెండా ఊపాడని చొక్కాపట్టుకుని ఈడ్చుకెళ్లారు -లాహోర్ స్టేడియంలో ఘోరం - పాకిస్తాన్‌కు బుద్ది రాదా? - వీడియో
Champions Trophy: చాంపియన్స్ ట్రోఫికి పాకిస్తాన్ ఆతిధ్యమిస్తోంది. ఇండియన్ ఫ్యాన్స్ కూడా మ్యాచులు చూసేందుకు వెళ్లారు. అయితే ఓ అభిమాని ఇండియా పతాకం ఊపాడని అతడిని అరెస్టు చేశారు.

Indian Flag in Pakistan: చిన్న చిన్న విషయాలతో ఇండియాలో పాకిస్తాన్ తనపై ద్వేషం పెంచుకునేలా ప్రవర్తిస్తోంది. తాజాగా ఆ దేశంలో భారత జెండాకు జరిగిన అవమానం .. ఆ దేశంపై కోపాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా అన్ని దేశాల ఫ్యాన్స్ వచ్చారు. ఓ భారతీయ ఫ్యాన్ కూడా వచ్చాడు. టిక్కట్ కొనుక్కుని స్టేడియంలోకి వెళ్లాడు. అయితే అతను భారత జెండా తీసుకెళ్లి ఊపడం ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలా వివిధ దేశాల జెండాలు.. ప్రదర్శించడం సహజమే. అయితే భారత జెండా మాత్రం ప్రదర్శించకూడదన్నట్లుగా గడాఫీ స్టేడియం అధికారులు..పోలీసులతో వచ్చి ఆ జెండాను లాక్కుని అతడిని అరెస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
A man arrested and beaten in Lahore stadium for having Indian Flag 🇮🇳 pic.twitter.com/TBFg8nlHa3
— Riseup Pant (@riseup_pant17) February 24, 2025
చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిధ్యమిస్తోంది. అయితే భద్రతా కారణాలతో ఆ దేశంలో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దాంతో భారత్ మ్యాచులన్నీ దుబాయ్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడే నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ లోని ప్రధాన స్టేడియంలో చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలను ఎగురవేయాల్సి ఉన్నా.. భారత జెండాను మాత్రం ఎగురవేయలేదు. అదేమిటంటే.. పాకిస్తాన్ కు వచ్చి ఆడిన వారి జెండాలను మాత్రం ఎగురవేస్తామని కథలు చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కూడా భారత జెండాలను ఎగురవేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
This video is said to be from #Lahore, #Pakistan...the video shows how few people are treated for holding the #IndianFlag with them in the #stadium...#cricket pic.twitter.com/YBRVatT0c5
— Surabhi Tiwari Rathi🇮🇳 (@surabhi_tiwari_) February 25, 2025
భారత జెండాను తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
🇮🇳🇵🇰 भारतीय ध्वज दिखाने पर शख्स पर हमला?
— RT Hindi (@RT_hindi_) February 25, 2025
एक अनवेरिफाइड वायरल वीडियो में युवक को लाहौर स्टेडियम के स्टैंड में झंडे के साथ दिखाया गया है। एक अधिकारी उससे झंडे को छीन लेता है, उसका कॉलर पकड़ लेता है और उसे खींचकर ले जाता है। कुछ लोगों के अनुसार, बाद में उस शख्स को गिरफ्तार कर लिया… pic.twitter.com/yc8biInsP8





















