INS Ranvir Explosion: ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో పేలుడు... ముగ్గురు సిబ్బంది మృతి, 11 మందికి గాయాలు
ముంబయి డాక్ యార్డ్ లో ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకా సిబ్బంది మృతి చెందారు.
ముంబయి డాక్ యార్డ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ రణవీర్ నౌక అంతర్గాత విభాగంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్పందించిన సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో నౌకలో భారీగా నష్టం జరగలేదు. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని ఐఎన్ఎస్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?
ఐఎన్‌ఎస్ రణవీర్‌లోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో మంగళవారం జరిగిన పేలుడులో భారత నౌకదళానికి చెందిన ముగ్గురు సిబ్బంది మరణించారు. ఈ ఘటన ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో చోటుచేసుకుందని ఏఎన్‌ఐ వార్త సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన 11 మంది నౌకా సిబ్బంది స్థానిక నౌకాదళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎన్ఐ తెలిపింది. నౌక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ పేలుడులో నౌకలో పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈరోజు జరిగిన దురదృష్టకర ఘటనలో ఐఎన్‌ఎస్ రణవీర్‌లోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నావికాదళ సిబ్బంది మరణించారని భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్
విచారణకు ఆదేశం
ఈ ఘటనపై బోర్డు ఆఫ్ ఎంక్వైరీని విచారణకు ఆదేశించినట్లు భారత నేవీ అధికారులు తెలిపారని ఏఎన్ఐ పేర్కొంది. ఐఎన్ఎస్ రణవీర్ ఐదో రాజ్‌పుత్ తరగతి డిస్ట్రాయర్‌లలో నాల్గోది. INS రణవీర్ అక్టోబర్ 28, 1986న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. గత ఏడాది అక్టోబర్‌లో భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ రణవిజయ్ డిస్ట్రాయర్‌లో మంటలు చెలరేగడంతో నలుగురు గాయపడ్డారు. విశాఖపట్నం నేవల్ హార్బర్‌లో ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్ నౌకను నిలిపివేసినప్పుడు ఈ ఘటన జరిగింది. గత ఏడాది మేలో భారత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, మంటలు ఆర్పడంతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Also Read: PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?