Top Headlines Today: పోలవరం పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల టీమ్, వారిపై కఠిన చర్యలు తప్పవన్న బండి సంజయ్ - టాప్ న్యూస్
Andhra Pradesh Telangana Latest News 30 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేస్తే 5 ప్రధాన వార్తలు ఒకేచోట మీకోసం.
Telangana News Today | 'ఆ పుస్తకాలు దేశ ప్రజలకు మార్గ నిర్ధేశం' - వెంకయ్యనాయుడిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) జీవితం స్ఫూర్తిదాయకమని.. ఆయన గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని మోదీ కొనియాడారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను పీఎం వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల టీమ్ - 4 రోజులపాటు పరిశీలన
పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
డీఎస్‌కు రేవంత్ రెడ్డి నివాళి - ఆయన ఫ్యామిలీకి అండగా కాంగ్రెస్: సీఎం
నిజామాబాద్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆదివారం (జూన్ 30) ఉదయం నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయన పార్థీవదేహానికి నమస్కరించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి మన్ కీ బాత్‌లో ప్రసంగించారు మోదీ. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర అంశాలు చర్చించారు. అందులో అరకు కాఫీని పొగడ్తల్లో ముంచెత్తారు. అదో అద్భుతం అని కొనియాడారు. అంతే కాదు. స్థానికంగా ఉన్న కొండదొరలు అరకు కాఫీలోని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో కూడా వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కమీషన్లు తీసుకుంటే ఖబర్దార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్
‘కొంత మంది దళారులు పీఎం విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా ద్రుష్టికి వచ్చింది. ఖబడ్దార్.. అలాంటి దళారులను ఉపేక్షించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలకు వెనుకాడబోం.’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దళారీ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. జూన్ 30 ఉదయం కరీంనగర్ లో పీఎం విశ్వకర్మ యోజన పథకం కోసం దరఖాస్తు చేస్తున్న పలువురు మహిళలు బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి