News
News
X

Emotional Video: 45 ఏళ్ల తరవాత తన చిన్ననాటి కేర్‌ టేకర్‌ను కలుసుకున్నాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి

Emotional Video: తన చిన్ననాటి కేర్‌టేకర్‌ను కలుసుకునేందుకు ఓ వ్యక్తి స్పెయిన్ నుంచి బొలీవియాకు వచ్చాడు.

FOLLOW US: 
 

 Emotional Video: 

గట్టిగా హత్తుకుని...ఏడ్చేసి..

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఉన్నట్టుండి వైరల్ అయిపోతుంటాయి. వీటిలో కొన్ని సరదాగా ఉంటే..మరి కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. మనసుని మెలి పెట్టేస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్నతనంలో తనకు సపర్యలు చేసిన కేర్‌టేకర్‌నుకలిసేందుకు స్పెయిన్ నుంచి బొలీవియాకు ప్రయాణం చేశాడో వ్యక్తి. దాదాపు  45 ఏళ్ల తరవాత ఆమెను కలిసేందుకు ఇలా బయల్దేరిన ఆ వ్యక్తి..తన ప్రయాణ మంతటినీ వీడియో తీశాడు. జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి మూమెంట్‌ను ఇలా రికార్డ్ చేశాడు. ఆమెను కలిసి హగ్ చేసుకునేంత వరకూ... అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లు వావ్ అనటమే కాదు...ఎమోషనల్‌ అవుతున్నారు కూడా. Goodnews Movement అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో...ఆ వ్యక్తి తన కేర్‌టేకర్‌ను కలుసుకునేందుకు ఎలా శ్రమించాడో చూపించారు. తన చిన్నతనంలో కన్న బిడ్డను చూసుకున్నట్టుగా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకుందని, అందుకే ఇంత దూరం వచ్చి ఆమెను కలుసుకుంటున్నానని చెప్పాడా వ్యక్తి. 45 ఏళ్ల తరవాత అతడిని చూసి ఆ కేర్‌ టేకర్ ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. గట్టిగా హత్తుకుని...అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "సో బ్యూటిఫుల్. నేను మా సిస్టర్స్ మా కేర్‌టేకర్‌ను కలుసుకునేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాం. కానీ..ఇప్పటికీ అది సాధ్యం కాలేదు" అని ట్వీట్ చేశాడో నెటిజన్. "ఎంత అద్భుతం" అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
 

Published at : 29 Sep 2022 03:41 PM (IST) Tags: Viral video Spain Bolivia Emotional Video Nanny 45 Years

సంబంధిత కథనాలు

Chandrababu : పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పథకాలు కట్ - చంద్రబాబు

Chandrababu : పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పథకాలు కట్ - చంద్రబాబు

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

AIIMS Server Hack: ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌ను సులువుగా తీసుకోలేం, దీని వెనకాల కుట్ర ఉండొచ్చు - కేంద్ర ఐటీ మంత్రి

AIIMS Server Hack: ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌ను సులువుగా తీసుకోలేం, దీని వెనకాల కుట్ర ఉండొచ్చు - కేంద్ర ఐటీ మంత్రి

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !