Elon Musk Tweet: మీరు ట్విటర్‌ను కొన్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు, మస్క్‌పై ఫన్నీ ట్వీట్ వైరల్
Elon Musk Tweet: ఎలన్ మస్క్‌పై చేసిన ఓ ఫన్నీ ట్వీట్ వైరల్ అవుతోంది.
Elon Musk Tweet:
నాకూ నమ్మశక్యంగా లేదు: మస్క్
ఎలన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆయనై ఏదో విధంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలపై సెటైర్లు వేశారు ట్విటర్ యూజర్స్. వాటికి తగ్గట్టుగా మస్క్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు కట్టాలంటూ తీసుకున్న నిర్ణయంపై చాలా రోజుల పాటు ట్విటర్లో మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పుడు మరోసారి ఓ టీవీ ఛానల్ ట్విటర్ హ్యాండిల్ మస్క్‌ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేసింది. "ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాడన్నది ఇంకా నమ్మశక్యంగా లేదంటూ ట్వీట్ చేసింది. ఫన్నీగా చేసిన ఈ ట్వీట్‌కు...మస్క్ కూడా అంతే ఫన్నీగా సమాధానమిచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేయడం తనకూ నమ్మశక్యంగా లేదని ట్వీట్ చేశారు. అంతే కాదు. టెస్లా షేర్లు అమ్మేసి మరీ ట్విటర్‌ను కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. 70 లక్షల మందికి ఈ ట్వీట్ రీచ్ అయింది. లక్ష మంది లైక్ చేశారు.
haha I still can’t believe Elon bought Twitter
— Whole Mars Catalog (@WholeMarsBlog) February 2, 2023
Me neither
— Elon Musk (@elonmusk) February 3, 2023
Sucks that I had to sell so much Tesla stock to do so (sigh)
— Elon Musk (@elonmusk) February 3, 2023
అకౌంట్ ప్రైవేట్..
ట్విటర్లో రోజుకో మార్పు వస్తోంది. ఎలన్ మస్క్ హస్తగతం అయినప్పటి నుంచి రోజూ వార్తల్లో నిలుస్తోంది ఈ కంపెనీ. ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ మస్క్ చెబుతున్నా...ఆయన తీసుకునే ప్రతి నిర్ణయమూ సంచలనమవుతోంది. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు మస్క్. ఈ క్రమంలోనే తన ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితమే... ట్విటర్లో పబ్లిక్, ప్రైవేట్ పోస్ట్‌ల ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ట్విటర్ యూజర్స్..ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఫీచర్ సరిగ్గా పని చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంప్లెయింట్స్ ఆధారంగా..మస్క్ ఆ ఫీచర్‌ను టెస్ట్ చేయాలనుకున్నారు. అందుకే...తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. ఫీచర్లో కొన్ని టెక్నికల్ సమస్యలున్నాయని...త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. అప్పటికే ఓ యూజర్ ఈ ఫీచర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టినా...పబ్లిక్ ఫీచర్ కన్నా ఎక్కువ మందికి రీచ్ అవుతోందని చెప్పాడు. దీనికి రెస్పాండ్ అయిన మస్క్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని...త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరవాత వెంటనే తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకుని టెస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్లతో ఆకట్టుకునే టెస్లా అధినేత తాజాగా తన పేరు మార్చుకున్నారు. ట్విట్టర్ అకౌంట్ కు ఎలన్ మస్క్ అనే పేరు ఉండగా ఇప్పుడు దాన్ని ‘మిస్టర్ ట్వీట్’గా మార్చేశారు. పేరు మార్చుకున్న తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. “నా ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నాను. కానీ, తిరిగి మార్చాలి అనుకున్నా ట్విట్టర్ అనుమతించడం లేదు” అంటూ ఫన్నీ ఎమోజీని పోస్టు చేశారు.
Also Read: Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!