Los Angles Fire : మూడేళ్ల క్రితం లాటరీ కొట్టి బిలియనీర్ అయ్యాడు - ఇప్పుడు అగ్ని ప్రమాదంతో బికారీ అయ్యాడు
Edwin Castros : 2022లో అమెరికా లాటరీ చరిత్రలో అతిపెద్ద జాక్‌పాట్ గెలుచుకున్న వ్యక్తి ఎడ్విన్ కాస్ట్రో. రాత్రికి రాత్రే కోట్లకు అతడు యజమాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచాడు.

Los Angles Wildfire: కొన్నిసార్లు ఊహించని విధంగా అదృష్ట దేవత మిమ్మల్ని ఆకాశానికి తీసుకెళ్లవచ్చు. ఆ వెంటనే దురదృష్ట దేవత మిమ్మల్ని అధ:పాతాళానికి తొక్కేయనూవచ్చు. కాకపోతే ఇది చాలా కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది. అలాగే ఓ వ్యక్తి ఒక్క క్షణంలోనే బిలీయనీర్ అయిపోయాడు. అది అనుభవించే సమయం వచ్చే సరికే మళ్లీ ఏం లేని బికారీ అయి రోడ్డు మీద పడ్డాడు. ఇతడి విషయంలో అదృష్ట దేవత ఓ నాటకం అడిందనే చెప్పుకోవచ్చు. ఒక్క దెబ్బతో ఒకరు విలాసవంతమైన ఇంటి యజమాని అయి, మళ్లీ నిరాశ్రయుడైపోయాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అడవి మంటల కారణంగా ఎడ్విన్ కాస్ట్రో అనే వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. అతడి కథ గురించి తెలుసుకుందాం.
ఎడ్విన్ కాస్ట్రో ఒక్క దెబ్బలోనే బిలియన్ల కోట్లకు యజమాని అయ్యాడు. కానీ ఒక ప్రమాదం కారణంగా అతను మళ్లీ తాను ప్రారంభించిన స్థానానికే చేరుకున్నాడు. 2022 సంవత్సరంలో అమెరికా లాటరీ చరిత్రలో అతిపెద్ద జాక్‌పాట్ గెలుచుకున్న వ్యక్తి ఎడ్విన్ కాస్ట్రో. రాత్రికి రాత్రే కోట్లకు అతడు యజమాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచాడు. అతను 2.04 బిలియన్ డాలర్ల మొత్తాన్ని లాటరీలో గెలుచుకున్నాడు, ఇది భారత రూపాయల్లో దాదాపు రూ.16,932 కోట్లు. అంటే దాన్ని సంఖ్యలో రాస్తే, అది 1,69,32,00,00,000. ఈ లాటరీ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది.
Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం
ఎడ్విన్ కాస్ట్రో జాక్‌పాట్ డబ్బుతో లాస్ ఏంజిల్స్‌లో తన వైభవాన్ని పెంచుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అతను తన తల్లిదండ్రుల కోసం 25.5 మిలియన్ డాలర్లు పెట్టి హాలీవుడ్ హిల్స్ భవనాన్ని, 4 మిలియన్ డాలర్లు పెట్టి జపనీస్ తరహా ఇంటిని, బెల్ ఎయిర్‌లో 47 మిలియన్ డాలర్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశాడు. ఇది కాకుండా, అతను బీచ్ ఫ్రంట్‌లో 3.8 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తిని కూడా కొనుగోలు చేశాడు.
కానీ 2025 సంవత్సరంలో ఎడ్విన్ కాస్ట్రో మరోసారి వార్తల్లో నిలిచాడు.. లాస్ ఏంజిల్స్‌లోని వినాశకరమైన అడవి మంటలు అతడి ఆనందాన్ని పూర్తిగా చెడిపేశాయి. అతని బీచ్‌ఫ్రంట్ ఆస్తి 3.8 మిలియన్ డాలర్ల విలువైనది, అగ్నిప్రమాదంలో ఇప్పుడు బూడిదైంది. పాలిసాడ్స్ అగ్నిప్రమాదంలో ఎడ్విన్ కాస్ట్రోకు చెందిన 3.8 మిలియన్ డాలర్ల విలువైన మాలిబు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు అదృష్టం ఎడ్విన్ కాస్ట్రోను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది, కానీ ఈ ప్రమాదం అతన్ని తిరిగి అతను ఎక్కడ ప్రారంభించాడో అదే నేలపైకి తీసుకువచ్చింది.
Also Read :LA wildfires: లాస్ ఏంజిల్స్‌లో 10వేల భవనాలు బూడిద కావడానికి కారణమేంటో తెలుసా ?
ఇప్పటివరకు 16 మంది మృతి
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వినాశనానికి కారణమైంది. ఐదో రోజు కూడా మంటలు అదుపుతప్పాయి. ఇప్పటివరకు కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన అగ్నిప్రమాదంలో 10,000కి పైగా భవనాలు బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం వల్ల ప్రభావితమైన ప్రజలు తమ అన్నింటినీ వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ అగ్నిప్రమాదం వల్ల దాదాపు 150 బిలియన్ డాలర్లు (₹12 లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లే అవకాశం ఉంది.





















