PM Modi's Ferozepur Visit: 'ఇదంతా మోదీ ప్రతీకారమే.. కానీ పంజాబ్ అంతకంత తిరిగిస్తుంది'
పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఈడీ దాడులపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ ప్రతీకారం తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికలు దగ్గర పడిన వేళ పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికి ఈడీని ప్రధాని మోదీ ఓ అస్త్రంగా వాడుకుంటున్నారని చన్నీ ఆరోపించారు. ఇసుక మాఫియా కేసులో చన్నీ దగ్గరి బంధువుకు చెందిన 8 వేరువేరు ప్రాంతాల్లో మంగళవారం ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. దీనిపై చన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
I have come to know that ED said, "Don't forget PM Modi's Ferozepur visit." This raid reflects 'revenge'. In order to implicate me, my nephew was interrogated for 24 hours ... The agency didn't get any proof against me: Punjab CM Charanjit Singh Channi pic.twitter.com/QidEmjzkec
— ANI (@ANI) January 19, 2022
ఈడీ చేసిన దాడులను కాంగ్రెస్ కూడా ఖండించింది. దేశంలో ఉన్న ఒకే ఒక్క దళిత ముఖ్యమంత్రిని మోదీ సర్కార్ ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది.
8 కోట్లు స్వాధీనం..
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువు భూపిందర్ సింగ్ నివాసాల్లో ఈడీ మంగళవారం దాడులు నిర్వహించింది. ఆయన ఇళ్లలో రూ. 8 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు నిర్వహించింది.
Also Read: Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్
Also Read: Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!
Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి