ED raids: ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
ED raids: రక్షణ శాఖ భూములను ఆక్రమించుకుని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ED raids: ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాల్లోని 12కు పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేస్తోంది. రక్షణ శాఖ భూములను ఆక్రమించుకుని దుర్వినియోగం చేశారని పలు ప్రాంతాల్లోని సంస్థలపై ఈడీ ఈ దాడులు నిర్వహిస్తోంది.
ఐటీ
మరోవైపు రాజస్థాన్‌లోని బికనేర్, నోఖాలోని 40 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ముగ్గురు బడా వ్యాపారుల ఇళ్ల స్థలాల్లో సోదాలు జరిగాయి. బికనేర్‌లో, తయాల్ గ్రూప్, రాఠీ గ్రూప్ ప్రాంగణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, నోఖాలో, ఝవర్ గ్రూప్ ప్రాంగణంలో ఐటీ బృందం సోదాలు నిర్వహించింది.
అలాగే SRS గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అనిల్ జిందాల్, డైరెక్టర్లు జితేందర్ కుమార్ గార్గ్, ప్రవీణ్ కుమార్ కపూర్, వినోద్ జిందాల్ సహా 19 మంది నిందితులు, సంస్థలపై ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. వివిధ గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా చేసిన మోసానికి సంబంధించిన కేసులో వ్యక్తులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ.2,045 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.