Arvind Kejriwal : ఎన్నికలకు ముందు ఆప్ పార్టీకి షాక్ - కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి
Arvind Kejriwal : ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతిచ్చింది.
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతివ్వడంతో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులను ప్రాసిక్యూట్ చేయడానికి ముందు ఈడీ ముందస్తు అనుమతి తీసుకోవాలని నవంబర్ 2024లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు సంస్థ వీకే సక్సేనాకు లేఖ రాయగా.. అందుకు ప్రతిస్పందించిన హోం శాఖ.. కేజ్రీవాల్ ఈ స్కామ్‌లో విచారించేందుకు అనుమతి మంజూరు చేయాలని పేర్కొంది.
2021-22కి సంబంధించి ఇప్పుడు అమలులో లేని ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌పై ఈ కేసు కొనసాగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో సహా ఇతర ఆప్ నేతలు ఈ కుంభకోణంలో భాగమైనట్టు ఆరోపణలు వచ్చాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 21, 2024న ఈడీ సిసోడియాను మొదటిసారి అరెస్టు చేసింది. తర్వాత, అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను 2024 జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 2024లో, ఆప్ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది .
బెయిల్ పొందిన కొద్ది రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ఆప్ నేత అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన 17 నెలల తర్వాత సిసోడియా ఆగస్టు 2024లో జైలు నుంచి బయటకు వచ్చారు. కాదా ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జంగ్‌పురా స్థానం నుంచి సీనియర్ పార్టీ నాయకుడిని ఆప్ పోటీకి దింపింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది. ఈ పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆప్ మాత్రం ఇప్పటికే మొత్తం అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్ కొంత మంది పేర్లను విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటి వరకు 63 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జనవరి నెల ప్రారంభంలో విడుదల చేసిన జాబితాలో కల్కాజీ నియోజకవర్గం నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా పోటీ చేస్తారని ప్రకటించింది.
Also Read : Kallakkadal Warning: 2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్