Earthquakes again in Delhi: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు - రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.7 తీవ్రతగా నమోదు
Delhi: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి .తీవ్రత 3.7 శాతంగా నమోదు కావడంతో పెద్దగా ఎఫెక్ట్ ఉండని భావిస్తున్నారు.

Earthquakes hit Delhi again: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాన్ని భూ ప్రకంపనలు వదలడం లేదు. శుక్రవారం సాయంత్రం మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.7గా నమోదు అయింది.
An earthquake of magnitude 3.7 on the Richter scale hits Jhajjar, Haryana pic.twitter.com/1MGbwxlub8
— ANI (@ANI) July 11, 2025
భూకంప కేంద్రం హర్యానా ప్రాంతంలో ఉన్నట్లుగా గా గుర్తించారు.
EQ of M: 3.7, On: 11/07/2025 19:49:43 IST, Lat: 28.68 N, Long: 76.72 E, Depth: 10 Km, Location: Jhajjar, Haryana.
— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Msp1JNfEb9
ఈ భూకంపం స్వల్ప తీవ్రత కలిగి ఉన్నప్పటికీ, ప్రకంపనలు స్పష్టంగా గమనించేలా ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో స్పందించారు. గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీలోని హై-రైజ్ భవనాలలో నివసించే వారు బలమైన ప్రకంపనలకు భయపడ్డారు. స్థానికులు భయాందోళనతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగెత్తారు. కానీ ఎటువంటి **ప్రాణనష్టం** లేదా **ఆస్తి నష్టం** నమోదు కాలేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది.
ఢిల్లీ సీస్మిక్ జోన్ IVలో ఉంది, ఇది భారతదేశంలో అత్యధిక భూకంప ప్రమాదం ఉన్న రెండవ జోన్. ఈ జోన్‌లో 5-6 తీవ్రత గల భూకంపాలు సాధారణం. ఝజ్జర్ సమీపంలో ఉన్న సోహ్నా ఫాల్ట్ లైన్ మరియు ఢిల్లీ-మొరాదాబాద్ ఫాల్ట్ లైన్ ఈ భూకంపానికి కారణంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ హిమాలయ జోన్‌కు 250 కి.మీ. దూరంలో ఉంది. ఈ కారణం వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప భూకంపాలకు దోహదం చేస్తుంది. ఢిల్లీ , హర్యానాలో భూగర్భ జలాల అధిక సంగ్రహణ ఫాల్ట్ లైన్‌లలో ఒత్తిడిని మార్చి, స్వల్ప భూకంపాలకు కారమంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) చెబుతోంది.
సోషల్ మీడియాలో పలువురు తాము భూప్రకంపనల తీవ్రతను చూశామని పోస్టులు పెడుతున్నారు.
Another earthquake - 2 earthquakes in 2 days!
— Akassh Ashok Gupta (@peepoye_) July 11, 2025
ho kya raha hai gurgaon mein??? 🧐🧐
Andar bhookamp, bahar paani!#earthquake #gurgaon
Earthquake In New Delhi Around 7:50 Today. That Sudden Shake Really Caught Me Off Guard 😳 Hope Everyone’s Safe....
— 🌹Ellems🌹 (@ellems00) July 11, 2025
Snake dance #Earthquake #DelhiEarthquake #StaySafe pic.twitter.com/ulBdeRukOM
ఈ భూకంపం ఝజ్జర్‌లో ఎపిసెంటర్‌తో సంభవించినట్లు NCS ధృవీకరించింది. ఈ భూకంపం స్వల్ప తీవ్రత కలిగి ఉన్నందున, ఎటువంటి నష్టం జరగలేదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భూకంపం తర్వా ప్రజలు భయపడవద్దని, అత్యవసర సహాయం కోసం 112 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. 1960లో ఢిల్లీ సమీపంలో 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం గత 100 సంవత్సరాలలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. అంత తీవ్రత గల భూకంపాలు మళ్లీ రాలేదు.





















