News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Knife In Stomach: పొట్టలో 15 సెం.మీ పొడవైన కత్తి, ఎక్స్ - రే చూసి వైద్యులు షాక్

ఎక్స్‌రే తీయగా పొట్టలో కత్తి ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. ఆపరేషన్ చేసి కత్తి ని డాక్టర్స్ తొలగించారు.

FOLLOW US: 
Share:

ఓ వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. అతన్ని పరిశీలించిన  వైద్యులు కడుపునొప్పికి కారణాలు తెలుసుకునేందుకు టెస్టులు చేశారు. ఆ టెస్టుల రిపోర్ట్‌లు చూసి వైద్యులు అవాక్కయ్యారు. అతని కడుపులో ఒక కత్తి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరా వ్యక్తి. ఆయన కడుపులోకి కత్తి ఎలా చేరింది. కడుపులో కత్తి ఉంచుకుని ఆ వ్యక్తి ఎలా బతికాడు. 

కడుపు నొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. మొదట ఎలాంటి లక్షణాలు లేవని కేవలం కడుపు నొప్పి మాత్రమే ఉందని ఆ వ్యక్తి డాక్టర్లకు చెప్పడంతో అసలు ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. చివరికి సమస్య ఏంటని ఎక్స్ రే తీయడంతో అసలు విషయం బయట పడింది. ఆ యువకుడి కడుపులో 15 సెంటీ మీటర్ల పొడవైన కత్తి ఉండటాన్ని చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందని ఆ యువకుడిని ప్రశ్నించగా.. అసలు విషయం బయట పెట్టాడు. అయితే కడుపులో కత్తి ఉన్నా ఆ యువకుడి శరీరంలోని అవయవాలేవీ దెబ్బతినకపోవడం విశేషం. ఈ ఘటన నేపాల్‌లో జరిగింది.

22 ఏళ్ల వయసు ఉన్న ఓ యువకుడు కడుపు నొప్పితో అంటూ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అతడికి వికారం, వాంతులు, విరేచనాలు ఇలా ఎలాంటి లక్షణాలు లేవని కేవలం కడుపు నొప్పి మాత్రమే ఉందని డాక్టర్లకు చెప్పాడు. బీపీ కూడా చెక్ చేసిన వైద్యులు నార్మల్‌‌గానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన వైద్యులు కడుపు కుడి వైపున ఉన్న ప్రాంతంలో ఒక గాయం కనిపించింది. అదేంటి అని ఆరా తీయగా అసలు విషయం బయటికి వచ్చింది. కడుపు నొప్పి రావడానికి ఒక రోజు ముందు గొడవ జరిగిందని.. ఓ వ్యక్తి కత్తితో పొడిచినట్లు చెప్పాడు. దీంతో ఆ యువకుడికి ఎక్స్ రే తీయగా.. కడుపులో కత్తి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను క్యూరియస్‌ అనే జర్నల్‌ ప్రచురితం చేసింది.

ఎక్స్ రేలో కనిపించిన కత్తిని బయటికి తీసేందుకు డాక్టర్లు ఆ యువకుడికి ఆపరేషన్ చేశారు. అనంతరం 15 సెంటీ మీటర్ల పొడవైన కత్తిని విజయవంతంగా బయటికి తీశారు. ఆ కత్తి కడుపులో కొన్ని గంటల పాటు ఉన్నప్పటికీ యువకుడి శరీరంలోని అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ కత్తి కడుపులో ఒక వైపు నుంచి మరో వైపుకు కదిలినట్లు డాక్టర్లు గుర్తించారు.

గొడవ జరిగిన సమయంలో ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యులకు చెప్పాడు. అసలు ఏం జరుగుతుందో తెలియలేదని.. కత్తితో పొడిచిన విషయం మాత్రం గుర్తుందని తెలిపాడు. ఆ తర్వాత స్థానికంగా ఉండే ఓ క్లీనిక్‌లో కత్తి గాటుకు కుట్లు వేయించుకున్నట్లు వివరించాడు. ఆ ఘటన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినట్లు తెలిపాడు. కత్తి గుచ్చడంతోనే కావచ్చని భావించి.. తగ్గిపోతుందని అనుకున్నా తగ్గకపోవడంతో డాక్టర్లను ఆశ్రయించినట్లు వెల్లడించాడు. 

Published at : 22 Sep 2023 07:13 AM (IST) Tags: Stomach Pain Nepal Viral News

ఇవి కూడా చూడండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి