అన్వేషించండి

భారత్‌ ఎప్పుడూ ఒక దేశం కాదంటూ డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు

DMK MP Raja sensational comments: భారతదేశం ఒక దేశం కాదంటూ డీఎంకే ఎంపి ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

DMK MP Raja Who Made Sensational Comments Saying That India Was Never One Country : డీఎంకే ఎంపి ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డీఎంకే ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ ఎంపీ రాజా మాట్లాడుతూ ఆస క్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. భారత్‌ ఎప్పుడూ ఒక దేశం కాదని పేర్కొన్న రాజా.. భిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన భారత్‌ ఉపఖండమంటూ పేర్కొన్నారు.

రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. భారతీయ జనతా పార్టీ డీఎంకే చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తుతోంది. గతంలో రాజా రాముడు గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తోంది. రాముడి గురించి తప్పుగా మాట్లాడారని, వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది బీజేపీ. రాజా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. రాజా వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదంటూ స్పష్టం చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటిని ఖండిస్తున్నామంటూ పేర్కొంది. 

డీఎంకే ఎంపీ రాజా ఏమన్నారంటే

డీఎంకే ఎంపీ రాజా ఆ పార్టీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. ఆ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వివాదం చెలరేగుతోంది. రాజా మాట్లాడుతూ భారత్‌ ఒక దేశం కాదని, ఎప్పుడూ ఒక దేశంగా లేదన్నారు. ఒకే భాష, ఒకే సాంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలుంటే ఒకే దేశమంటారని, కానీ, భారత్‌ అలా కాదని రాజా పేర్కొన్నారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులున్న రాష్ట్రాలు కలిసి దేశంగా ఏర్పడ్డాయన్న రాజా.. అందుకే ఇది దేశం కాదు.. ఉప ఖండం అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని వివరించారు. 

తప్పుబడుతున్న బీజేపీ

డీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. డీఎంకే నుంచి ఇటువంటి విద్వేష ప్రసంగాలు వస్తూనే ఉన్నాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదం ముగియకముందే.. మరో నేత అదే తరహాలో మాట్లాడడం దారుణమని బీజేపీ ఆక్షేపించింది. దీనిపై కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఈ తరహా మాటలు, వ్యాఖ్యలను మానుకోవాలని బీజేపీ కోరింది. ఇదిలా ఉంటే డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలు, బీజేపీ విమర్శలు నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. రాజా చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ సమాధానాన్ని ఇచ్చారు. వాటితో వందశాతం ఏకీభవించడం లేదంటూ ఆమె స్పష్టం చేశారు. రాజా వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఎవరైనా, ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని ఆమె కోరారు.

ఏది ఏమైనా రాజా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగినట్టు అయింది. బీజేపీ నాయకుడు అమిత్‌ మాల్వియా రాజా మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ద్వేషపూరిత ప్రసంగంలో భారతదేశం ఔన్నత్యాన్ని ప్రశ్నించే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
IPL 2025 RCB Retention List: ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Embed widget