(Source: ECI/ABP News/ABP Majha)
DMHO Recruitment: విజయనగరం డీఎంఎచ్‌వోలో ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి - అర్హతలివే!
విజయనగరంలోని జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
విజయనగరంలోని జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుని అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధలు నవంబర్ 7లోపు దరకాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి.
పోస్టుల వివరాలు..
1) ల్యాబ్ అసిస్టెంట్: 01
అర్హత: ఇంటర్మీడియట్(ల్యాబ్ అసిస్టెంట్ ఒకేషనల్ కోర్సు) ఉత్తీర్ణత.
జీతం: రూ.15000.
2) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II: 01
అర్హత: ఇంటర్ ఒకేషనల్(ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌టీ/ బీఎస్సీ.ఎంఎల్‌టీ), కాంట్రాక్ట్ /అవుట్ సోర్సింగ్/కోవిడ్-19పై పని చేసిన అనుభవ ధృవీకరణ పత్రం జతపరచాలి.
జీతం: రూ.19,019.
3) ఫార్మసిస్ట్ గ్రేడ్-II: 02
అర్హత: డి.ఫార్మసీ/బి.ఫార్మసీ/ఎం.ఫార్మసీ, కాంట్రాక్ట్ /అవుట్ సోర్సింగ్/కోవిడ్-19పై పని చేసిన అనుభవ ధృవీకరణ పత్రం జతపరచాలి.
జీతం: రూ.19,019.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి.
ఎంపిక విధానం: మెరిట్‌లిస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ: 01.11.2022.
ఆఫ్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 07.11.2022.
దరఖాస్తుల పరిశీలన తేదీలు: 08.11.2022 నుంచి 09.11.2022 వరకు.
తాత్కాలిక మెరిట్ జాబితా వెల్లడి: 10.11.2022.
ఫిర్యాదుల పరిష్కారం: నవంబర్ 11,12.
తుది మెరిట్ జాబితా వెల్లడి: 16.11.2022.
నియామక ఉత్తర్వుల జారీ: 21.11.2022.
Lab-Technician Grade- II and Pharmacist Grade-II
Also Read
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో అప్రెంటిస్‌షిప్‌లు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తు చేసుకోండి!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏఈఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 14లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...