అన్వేషించండి

Duckworth Passes Away : డిఎల్ఎస్ సహరూప కర్త డక్ వర్త్ కన్నుమూత

Duckworth Passes Away at Age 84 : క్రికెట్ లో వినియోగించే డక్ వర్త్ లూయిస్ విధానానికి ఆద్యుడిలో ఒకరైన డక్ వర్త్ 84 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

DLS Creator Duckworth Passes : క్రికెట్ లో వినియోగించే డక్ వర్త్ లూయిస్ (డిఎల్ఎస్) విధానం సహరూప కర్త ప్రాంక్ డక్ వర్త్ (84) కన్నుమూశారు. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వర్షం పడితే ఫలితం రాబట్టేందుకు ఉపయోగించే ఈ పద్ధతిని ఇంగ్లాండ్ చెందిన డక్ వర్త్, టోనీ లూయిస్ రూపొందించారు. దీనిని 1997లో మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి అమోదంతో ఉపయోగించారు. వీరి గౌరవార్థం ఈ విధానానికి వారి పేరునే పెట్టారు. ఈ విధానాన్ని రూపొందించిన వారిలో ఒకరైన డక్ వర్త్ తాజాగా మృతి చెందారు. 84 ఏళ్ల డక్ వర్త్ ఈ నెల 21న వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ రూపొందించిన ఈ డక్ వర్త్ లూయిస్ విధానానికి ఆస్ట్రేలియా కు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అప్పటి నుంచి డిఎల్ కాస్త.. డక్ వర్త్ - లూయిస్ - స్టెర్న్ డిఎల్ఎఫ్ గా స్థిరపడింది. 

ఈ విధానాన్ని ఎప్పుడూ వినియోగిస్తారు అంటే 

డక్ వర్త్ లూయిస్ విధానాన్ని వర్షం పడిన సందర్భాల్లో వినియోగిస్తుంటారు. ఈ విధానం రావడానికి ముందు వర్షం పడితే మ్యాచ్ రద్దు చేసేవారు. అప్పటికే ఒక జట్టు కొంతవరకు మ్యాచ్ ఆడినప్పటికీ ఈ విధానం లేకపోవడం వల్ల మ్యాచ్ ను రద్దు చేసే పరిస్థితి క్రికెట్లో ఉండేది. వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహించేవారు. లేకపోతే రద్దు చేయడం మరో రోజు నిర్వహించడం చేసేవారు. అయితే ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మ్యాచ్ ను వర్షం తగ్గిన తర్వాత నిర్వహించడం, అప్పటికే మ్యాచ్ జరిగి ఉంటే ఇరుజట్ల ఆటను పరిశీలించి ఈ విధానంలో విజేతను ప్రకటిస్తూ వస్తున్నారు. దీనివల్ల అనేక మ్యాచ్ ల్లో ఫలితాలు తేలుతున్నాయి. వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం ఏర్పడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలంటే లక్ష్యాన్ని సవరించేందుకు డిఎల్ఎఫ్ ను ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ అంతర్జాతీయంగా అనేక మ్యాచ్ లకు సంబంధించిన ఫలితాలను ఈ విధానం ద్వారానే వర్షం పడినప్పుడు తేల్చుతున్నారు. 

క్రికెట్ వర్గాల నుంచి సంతాపం 

డక్ వర్త్ మృతి పట్ల క్రికెట్ వర్గాల నుంచి విస్మయం వ్యక్తం అవుతోంది. క్రికెట్ కు ఆయన అందించిన విధానం ఎంతగానో మేలు చేస్తోందని పలువురు క్రికెటర్లు పేర్కొంటున్నారు.  ఆయన మృతి తీరని లోటు అంటూ పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget