Delhi Ministers Resignation: సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా - ఆమోదించిన సీఎం కేజ్రీవాల్
Delhi Ministers Resignation: ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు.
Delhi Ministers Resignation:
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. ఈ మేరకు కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించారు. మనీశ్ సిసోడియాకు 18 మంత్రిత్వ శాఖల బాధ్యత అప్పగించారు కేజ్రీవాల్. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు సత్యేంద్ర జైన్. అయితే ఆయన కూడా ఓ స్కామ్‌లో భాగంగా అరెస్ట్ అయ్యారు. దాదాపు 10 నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఆయన జైలుకి వెళ్లిన తరవాత ఆరోగ్య శాఖ కూడా సిసోడియాకు అప్పగించారు కేజ్రీవాల్. ఇప్పుడు సిసోడియా కూడా సీబీఐ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ అరెస్ట్ చేసినప్పటికీ సిసోడియా మంత్రిత్వ పదవిలో ఎలా కొనసాగుతున్నారంటూ బీజేపీ ఇప్పటికే ప్రశ్నలు సంధించింది. ఆ వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం సంచలనమైంది.
Delhi ministers Manish Sisodia and Satyendar Jain resign from their posts in the state cabinet; CM Arvind Kejriwal accepts their resignation. pic.twitter.com/rODxWkSoc9
— ANI (@ANI) February 28, 2023
CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు నిచ్చింది. హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేలవ్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. తనిఖీల్లో ఎలాంటి నగదు దొరకలేదని, ఛార్జ్‌షీట్‌లోనూ ఆయన పేరు లేదని సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకి తెలిపారు. అయితే...ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బిజీగా ఉంటున్నారని వివరించారు. ఆయనే ట్రిబ్యునల్ విధులూ నిర్వర్తిస్తు న్నారని చెప్పారు. సిసోడియా అరెస్ట్‌ను తప్పు పట్టారు సింఘ్వీ. అయితే...సుప్రీంకోర్టు మాత్రం "మీరేం చెప్పినా హైకోర్టులోనే చెప్పుకోండి. మేం ఈ పిటిషన్‌ను విచారించలేం" అని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తామని, హైకోర్టుకు వెళ్తామని ఆప్ స్పష్టం చేసింది.