News
News
X

Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!

Delhi: దిల్లీలో నడిరోడ్డుపై ఓ కుర్రాడ్ని కొంతమంది దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Delhi: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే అక్కడ చుట్టూ ఉన్న జనం కనీసం స్పందించకపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. 

ఇదీ జరిగింది

శనివారం సాయంత్రం సుందర్‌ నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమచాారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

" ముగ్గురు దుండగులు కత్తులతో దారుణంగా పొడుస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముందు బాధితుడితో పాటు నిందితులు మాట్లాడుతూ వచ్చారు. ఆ కొద్ది సేపటికే అతడిపై దాడి చేసేందుకు యత్నించగా అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, ముగ్గురు ఉండటంతో వారి నుంచి తప్పించుకోలేకపోయాడు. పథకం ప్రకారం కత్తులతో వచ్చిన దుండగులు.. విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.                                                         "
-  పోలీసులు
 
News Reels

స్పందించని జనం

బాధితుడ్ని కత్తులతో పొడుస్తోన్న సమయంలో ఆ పక్కనే కొంత మంది కూర్చుని ఉన్నారు. ఒకతను కూర్చీలో కూర్చొని ఉండగా, మరొక వ్యక్తి బైక్‌పై కూర్చొని ఉన్నాడు. ఇంత జరుగుతున్నా వారిలో కనీసం చలనం కూడా లేదు. అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అలామ్‌, బిలాల్‌, ఫైజాన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. 

ఇందుకే హత్య

బాధితుడు సుందర్‌ నగరికి చెందిన మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. పాత పగలతోనే యువకుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి బంధువులు, స్థానికులు.. ఆదివారం భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు.

Also Read: Rahul Gandhi on Gandhi Jayanti: మహాత్ముడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ శపథం!

Also Read: Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు

Published at : 02 Oct 2022 02:42 PM (IST) Tags: Delhi Man Stabbed To Death Sunder Nagri Area Locals Stage Protest

సంబంధిత కథనాలు

ఏపీలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు - ఢిల్లీ పర్యటనలో మంత్రి విడ‌ద‌ల రజిని

ఏపీలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు - ఢిల్లీ పర్యటనలో మంత్రి విడ‌ద‌ల రజిని

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

టాప్ స్టోరీస్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు