Delhi Liquor Policy Case: సిసోడియాను వదలని ఈడీ, వారం రోజుల రిమాండ్‌కు కోర్టు అంగీకారం
Delhi Liquor Policy Case: సిసోడియాను రిమాండ్‌లో ఉంచేందుకు అనుమతించాలని ఈడీ కోరగా కోర్టు అనుమతించింది.
Delhi Liquor Policy Case:
కోర్టు పరిశీలనలో..
మనీశ్ సిసోడియాను 10 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచేందుకు రౌజ్ అవెన్యూ కోర్టుకు పిటిషన్ పెట్టుకుంది ఈడీ. విచారణకు ఆయన సహకరించడం లేదని, మరి కొద్ది రోజులు ప్రశ్నించాల్సిన అవసరముందని నివేదించింది. ఇదే సమయంలో సిసోడియా బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను మార్చి 21కి వాయిదా వేసిన కోర్టు..మార్చి 17 వరకూ ఈడీ రిమాండ్‌లో ఉంచేందుకు అంగీకరించింది.
Delhi's Rouse Avenue Court sends AAP leader and former Delhi Deputy Chief Minister Manish Sisodia to ED remand till March 17 in excise policy case. pic.twitter.com/Kh70KfYPc8
— ANI (@ANI) March 10, 2023
ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు సిసోడియా. అయితే...ఆయనను పూర్తి స్థాయిలో విచారించాలని, సమన్లు జారీ అయిన వారందరితో సిసోడియాకు ఎలాంటి సంబంధం ఉందో తేల్చాలని చెబుతోంది. సిసోడియా CA కూడా కొన్ని కీలక విషయాలు చెప్పాడని, కానీ సిసోడియా మాత్రం విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే...ఈడీ రిమాండ్ పిటిషన్ వేయడంపై సిసోడియా తరపున న్యాయవాది ఖండిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ తన వాదనలు వినిపించారు.
"ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదించారు. ఏ మాత్రం పరిశీలించకుండానే ఆ నిర్ణయం తీసుకుంటారా..? ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్‌లు చేస్తూ పోతున్నారు. అమాయకులను నిందితులుగా చేసి వాళ్లను నిరపరాధులుగా నిరూపించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం 57 పేజీల రిమాండ్ పిటిషన్ వేశారు. అందులో దాదాపు సీబీఐ కేసులో ఉన్న అంశాలే ఉన్నాయి. మనీలాండరింగ్ జరిగింది అని చెప్పడానికి కనీసం ఓ డాక్యుమెంట్ ఆధారం కూడా ఈడీ వద్ద లేదు. అయినా రిమాండ్ అడుగుతున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నదే. PMLA చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని సిసోడియాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు"
- సిసోడియా తరపు న్యాయవాది
Delhi excise policy case | ED tells Delhi Court that it is seeking 10-day custody for interrogation of Manish Sisodia to identify the modus operandi and to confront other persons who have been summoned
— ANI (@ANI) March 10, 2023
Delhi excise policy case | Senior Advocate Dayan Krishnan, appearing for Manish Sisodia, opposes ED plea seeking Sisodia's 10-day custody
— ANI (@ANI) March 10, 2023
తీహార్ జైళ్లో ఉన్న మాజీ మంత్రి సిసోడియాను ప్రత్యేక కోర్టు అనుమతితో మార్చి 7 నుంచి మూడు రోజులపాటు ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తయిన తరువాత సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే మొదట ఈ కేసులో నవంబర్ 25, 2022న సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన సమయంలో సిసోడియా పేరు సైతం ఇందులో లేదని ఆప్ నేతలు ప్రస్తావిస్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆప్ నేతలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం నిప్పులు చెరిగారు. ముందు సీబీఐ, ఇప్పుడు ఈడీ అధికారులు సిసోడియాను లక్ష్యంగా చేసుకుని వ్యవరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. జరుగుతున్నది గమనిస్తే.. ఏం జరిగినా సరే సిసోడియాను మాత్రం జైళ్లో ఉంచాలి అనేది వారి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు కేజ్రీవాల్.