News
News
X

Delhi Liquor Scam Update : లిక్కర్ స్కాం నిందితుడు పిళ్లై యూటర్న్ - ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంపై వెనక్కి !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని పిళ్లై పిటిషన్ వేశారు.

FOLLOW US: 
Share:

Delhi Liquor Scam Update :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది.  అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలంగాణ ఎమ్మెల్సీ తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. 

హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై   తాను కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీనని ఇంతకు ముందు ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ రిపోర్టును ఈడీ  అధికారులు కోర్టుకు సమర్పించారు. ని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఈడీ ఆరోపించింది.  ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని  తెలిపింది.  ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారు. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

అరుణ్ రామచంద్ర పిళ్లైను సీబీఐ, ఈడీ అధికారులు చాలా కాలంగా విచారిస్తున్నారు. దాదాపుాగ 29 రోజుల పాటు ఆయనను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే పిళ్లై వాంగ్మూలం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటన్నది ఆశ్చర్యకరంగామారింది. ఒక్ వేళ ఆ వాంగ్మూలం నిజం కాకపోతే.. ఏ ఉద్దేశంతో కవిత పేరును తెరపైకి తెచ్చారన్నది తేలాల్సి ఉంటుంది. ఆయన తాను కవిత తరపునే వ్యాపారం చేస్తున్నానని చెప్పుకోవడానికి దారి తీసిన పరిస్థితులేమిటో వెల్లడి కావాల్సి ఉంటుంది. ఈ అంశం ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతోంది. తమను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని కవిత, కేటీఆర్ కూడా ఆరోపించారు. 

వాంగ్మూలం వెనక్కి తీసుకుంటానన్న రామచంద్ర పిళ్లై పిటిషన్‌పై ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 9వ తేదీనే ఆమె హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా గడువు కోరి 11వ తేదీకి మార్చుకున్నారు. ఈ లోపే వాంగ్మూలం ఉసంహరణ పిటిషన్ పిళ్లై దాఖలు చేయడంతో కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. 

Published at : 10 Mar 2023 01:27 PM (IST) Tags: Kalvakuntla Kavita Delhi Liquor Scan Ramachandra Pillai

సంబంధిత కథనాలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా, నన్ను వివాదాల్లోకి లాగొద్దని లేఖ

D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా, నన్ను వివాదాల్లోకి లాగొద్దని లేఖ

టాప్ స్టోరీస్

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!