Delhi Water Crisis: ఢిల్లీలో ముదురుతున్న నీటి సంక్షోభం, జల్ బోర్డ్ కార్యాలయం ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు - ఆప్ ఆగ్రహం
Delhi Jal Board: ఢిల్లీలోని జల్ బోర్డ్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం అలజడి సృష్టించింది. హరియాణా నుంచి రావాల్సిన నీటి వాటా తేలకపోవడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం మరింత ముదురుతోంది.

Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం రోజురోజుకీ (Delhi Water Crisis) ముదురుతోంది. హరియాణా నుంచి రావాల్సిన నీటి వాటా రావడం లేదని ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. విచారణ చేపట్టిన కోర్టు ఆప్‌ని మందలించింది. వాటర్ ట్యాంకర్ మాఫియా కొనసాగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పోలీసులను రంగంలోకి దింపి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రాజకీయంగానూ ఈ అంశం వేడి పుట్టించింది. ఇది పూర్తిగా ఆప్ వైఫల్యమే అని బీజేపీ స్పష్టం చేస్తోంది. నీళ్లను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ జల్ బోర్డ్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. దీనిపై ఆప్ తీవ్రంగా మండి పడుతోంది. ఇదంతా ఎవరి కుట్రో అర్థమవుతోందా అని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓ పోస్ట్ పెట్టారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శించారు.
देखिए भाजपा के पटके पहने नेता और भाजपा नेता ज़िंदाबाद लगाते कार्यकर्ता, दिल्ली जल बोर्ड के दफ़्तर में सरकारी संपत्ति को तोड़ते हुए।
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) June 16, 2024
जगह जगह पानी की पाईपलाइन कौन तुड़वा रहा है ? किसका षड्यंत्र है ? pic.twitter.com/ShZWR7ADJi
బీజేపీయే కుట్ర చేసి మరీ ఢిల్లీలో నీటి సరఫరా కాకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది ఆప్. పైప్‌లైన్‌లనూ పగలగొట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాదు. పైప్‌లైన్స్‌కి పోలీసులతో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ మంత్రి అతిషి ఈ మేరకు ఢిల్లీ కమిషనర్‌కి లేఖ రాశారు. పైప్‌లైన్స్ వద్ద భద్రత ఏర్పాటు చేసేలా చొరవ చూపించాలని కోరారు. అంతకు ముందు మంత్రి అతిషి ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఓ పైప్‌లైన్‌పై నట్స్, బోల్ట్స్ తొలగించారని, ఇది ఎవరి పని అని ప్రశ్నించారు. వచ్చే 15 రోజుల పాటు పైప్‌లైన్స్‌కి రక్షణ కల్పించాలని ఆప్ కోరుతోంది. యమునా నదిలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఈ స్థాయిలో సమస్య తలెత్తింది. ఇప్పటికే ఢిల్లీ జల్ బోర్డ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ వద్ద ప్యాట్రోలింగ్ చేస్తోంది.
कल दिल्ली जल बोर्ड की पेट्रोलिंग टीम को साउथ दिल्ली राइजिंग मेन पाइपलाइन में गढ़ी मेंडू ट्रांसफार्मर के पास बड़ी लीकेज मिली। जाँच पर पता चला कि 375mm के 5 बोल्ट और 12 इंच का एक बोल्ट किसी के द्वारा काटा गया था। ऐसा लग रहा है कि दिल्ली में पानी की परेशानी बढ़ाने के लिए षड्यंत्र हो… pic.twitter.com/qvJATlz7fx
— Atishi (@AtishiAAP) June 16, 2024
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు






















