By: Ram Manohar | Updated at : 22 May 2023 01:07 PM (IST)
పరువు నష్టం దావా కేసులో బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
Delhi HC Summons BBC:
డాక్యుమెంటరీ వివాదంలో..
ఢిల్లీ హైకోర్టు BBCకి సమన్లు జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో ఈ నోటీసులు ఇచ్చింది. గుజరాత్కు చెందిన Justice On Trial NGO ఈ పిటిషన్ వేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించింది. అంతే కాదు. భారత దేశ పరువుని దిగజార్చాలని చూసిందంటూ పిటిషన్లో పేర్కొంది. పిటిషనర్లు చెప్పినట్టుగానే ఆ డాక్యుమెంటరీ ప్రధాని పరువుకి భంగం కలిగించిందని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ మేరకు BBCకి నోటీసులిచ్చింది.
"బీబీసీ డాక్యుమెంటరీ ప్రధాని పరువుకి భంగం కలిగించేలా ఉండడమే కాదు. భారత దేశ ప్రతిష్ఠకూ మచ్చ తెచ్చే విధంగా ఉంది. అన్ని విధాలుగా విచారించి బీబీసీకి నోటీసులు పంపుతున్నాం"
- ఢిల్లీ హైకోర్టు
కించపరిచారంటూ వాదన..
ఎన్జీవో తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డాక్యుమెంటరీ దేశ న్యాయవ్యవస్థనీ కించపరిచిందని మండి పడ్డారు. ఈ నెల 3వ తేదీన ఢిల్లీ ట్రయల్ కోర్టు బీబీసీతో పాటు వికీమీడియా, ఇంటర్నెట్ ఆర్కీవ్ సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. ఓ బీజేపీ నేత వేసిన పిటిషన్ ఆధారంగా...విచారించిన ట్రయల్ కోర్టు ఆయా సంస్థలకు సమన్లు జారీ చేసింది. "బీబీసీ డాక్యుమెంటరీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ లాంటి ప్రముఖ సంస్థలను కించపరిచింది" అని పిటిషన్లో ప్రస్తావించారు ఆ బీజేపీ నేత. ప్రభుత్వం దీనిపై బ్యాన్ విధించినా...వికీపీడియాలో ఇంకా లింక్స్ కనిపిస్తున్నాయని, ఇంటర్నెట్ ఆర్కీవ్స్లోనూ వీడియోలు కనిపిస్తున్నాయని చెప్పారు.
Controversial documentary: Delhi HC issues summons to BBC on defamation suit
— ANI Digital (@ani_digital) May 22, 2023
Read @ANI Story | https://t.co/a1Ue2QnmzE#DelhiHC #BBC #BBCdocumentary pic.twitter.com/Xi1VE6snp4
ఈడీ కేసు నమోదు
ఇప్పటికే బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది. Foreign Exchange Management Act కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించింది. విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. రెండు నెలల క్రితం దాదాపు మూడు రోజుల పాటు ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. అప్పట్లో అది సంచలనమైంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అప్పుడు వెల్లడించారు. ఈ సర్వే పూర్తైన తరవాత బీబీసీ కీలక ప్రకటన చేసింది. అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. కానీ ఈలోగా ఈడీ షాక్ ఇచ్చింది. విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు పలువురు ఉద్యోగులను విచారించినట్టు తెలుస్తోంది. కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించినట్టు సమాచారం. "BBC ఉద్యోగిని పిలిచారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు చూపించాలని అడిగారు. కొన్ని ప్రశ్నలు కూడా వేశారు" అని ఓ అధికారి స్పష్టం చేశారు. గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ వివాదాస్పదం అయినప్పటి నుంచి కేంద్రం ఉద్దేశపూర్వకంగా బీబీసీని టార్గెట్ చేసిందన్న ఆరోపణలున్నాయి.
Also Read: PM Modi Awarded: ప్రధాని మోదీకి అత్యున్నత అవార్డులు, ద్వీప దేశాల్లోనూ అదే క్రేజ్
Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్