అన్వేషించండి

Dead Body in Plane Wheel : విమానం టైరులో డెడ్ బాడీ - అసలు ఆ వ్యక్తి ఎందుకు, ఎలా వెళ్లాడు?

Dead Body in Plane Wheel : ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం టైరులో అధికారులు ఓ డెడ్ బాడీని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Dead Body in Plane Wheel : హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంలోని టైరులో మృతదేహం కనిపించింది. డెడ్ బాడీని గుర్తించిన అధికారులు.. అసలు ఈ టైరులోకి మృతదేహం ఎప్పుడు ఎలా వచ్చింది.? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని చికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చినట్టు సమాచారం. విమానం బయటి నుంచి మాత్రమే ఎవరైనా ఈ వీల్ వెల్‌లోకి వెళ్లేందుకు యాక్సెస్ ఉంటుంది. మరి ఆ వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లాడు అన్న విషయం ఇంకా తెలియలేదని ఎయిర్ లైన్ ప్రతినిధి తెలిపారు.

'ఫ్లైట్ 202 చికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డిసెంబర్ 24న (మంగళవారం) స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:31 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:12 గంటలకు మౌయ్‌లోని కహులుయి విమానాశ్రయంలో దిగింది. ల్యాండింగ్ తర్వాత, "యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మెయిన్ ల్యాండింగ్ గేర్‌లలో ఒకదాని వీల్ వెల్‌లో ఒక మృతదేహం కనుగొన్నాం' అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read : VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!

మరోపక్క వ్యక్తి మరణంపై డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోందని డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి అలానా కె. పికో తెలిపారు. దర్యాప్తుపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ విధంగా చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇలా చేసే వారు మళ్లీ బయటకు వచ్చేటప్పుడు బతికే ఉంటారని నమ్మకం ఉండదు. అలాంటి అవకాశాలూ తక్కువే. ఎందుకంటే ఈ వీల్ వెల్ చాలా ఇరుకుగా ఉంటుంది. ల్యాండింగ్ గేర్ వెనక్కి తిప్పినపుడు ఇందులో ఉన్న వ్యక్తి చనిపోయే అవకాశం ఉంటుంది.

2023లోనూ ఓ వ్యక్తి విమానం వీల్ వెల్‌లోకి వెళ్లాడు. కానీ అతను ఆశ్చర్యంగా బతికిపోయాడు. విమానంలోని అండర్ క్యారేజ్ బేలో ప్రయాణించిన ఆ వ్యక్తిని విమానం సిబ్బంది సేఫ్‌గా బయటికి తీసుకువచ్చారు. అప్పట్లో ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. 2021లోనూ గ్వాటెమాల నుంచి మయామికి వెళ్లే విమానంలో 26 ఏళ్ల వ్యక్తి.. విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు తెలిపారు. 2019 లో, కెన్యాలోని నైరోబీ నుండి హీత్రూ విమానాశ్రయానికి వెళ్లే విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుంచి పడిపోయినట్లు భావిస్తున్న వ్యక్తి మృతదేహం నైరుతి లండన్‌లోని ఇంటి పెరట్లో దిగింది.

Also Read : Pakistan Beggars: పాకిస్తాన్‌లో నెంబర్ వన్ ఉద్యోగం అడుక్కోవడమట - లక్షల్లో బిచ్చగాళ్లు - ఇలా అయిపోతోందంటి ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget