(Source: ECI/ABP News/ABP Majha)
Smuggling : ఇవి కూడా స్మగ్లింగ్ చేస్తారా ? - ధాయ్‌ల్యాండ్ నుంచి విమానంలో చెన్నై వాసి ఏం తెచ్చాడో తెలుసా
Chennai : విదేశాల నుంచి వచ్చేటప్పుడు బంగారం స్మగ్లింగ్ చేస్తారు..లేకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారు. కానీ ఆ చెన్నై వ్యక్తి మాత్రం జంతువుల్ని రహస్యంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.
Exotic Animals Smuggling : చెన్నై ఎయిర్ పోర్టు చాలా బిజీగా ఉంటుంది. కస్టమ్స్ అధికారులు విదే్శాల నుంచి వచ్చే వారి కోసం అత్యాధునిక పరికరాలతో నిఘా పెడతారు. అన్ని బ్యాగుల్ని చెక్ చేస్తారు. ఎక్కవగా బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరుకుతూంటారు. అందుకే అలాంటి వాటి ఆనవాళ్లు కనిపెట్టడానికి ప్రత్యేకమైన యంత్రాలు కూడా అమర్చారు. కానీ ధాయ్ లాండ్ నుంచి ఓ వ్యక్తి బ్యాగుల్ని చూసి అదిరి పడ్డారు. అందులో డ్రగ్స్ లేవు.. బంగారం అంత కంటే లేదు. కానీ జంతువులు ఉన్నాయి. అవి కూడా ధాయ్‌ల్యాండ్‌లో మాత్రం ప్రత్యేకంగా ఉండే జంతువులు.
22 ధాయ్ జంతువుల్ని బాగుల్లో తెచ్చిన వ్యక్తి
చెన్నైకు చెందిన మహమ్మద్ మీరా సర్దార్ అలీ ధాయ్ ల్యాండ్ పెద్దగా లగేజీ లేకుండానే వెళ్లారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా బ్యాగులతో వచ్చారు. ఆ బాగుల్ని చెన్నై ఎయిర్ పోర్టులో చెక్ చేసిన అధికారులకు డౌట్ వచ్చింది. వాటిలో స్కానర్లకు ఏమీ దొరకలేదు. కానీ ఆ బ్యాగుల్లో కదలికలు ఉన్నాయి. దాతో ఓపెన్ చేసి చూసేసరికి వారికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
అనుమతులు లేకుండా స్మగ్లింగ్
మొత్తం 22 ధాయ్ ల్యాండ్ లోనే కనిపించే వివిధ రకాల జంతువులు ఉన్నాయి. అందులో కొండ ముచ్చు, పాములు,తాబేలు గుడ్ల గూబ వంటి జంతవులు ఉన్నాయి. ఇలా వీటిని తెచ్చుకోవాలంటే వైల్డ్ లైఫ్ అనుమతులు కావాలి. అలాంటివేమీ లేకపోవడంతో మహమ్మద్ మీరా సర్దార్ అలీ మీద కేసు పెట్టారు కస్టమ్స్ అధికారులు. అతను ఆ జంతువుల్ని ఎందుకు తెచ్చాడో ఆరా తీస్తున్నారు. తనకు జంతువులు అంటే ఇష్టమని అందుకే తెస్తున్నానని ఆయన అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్, వీడియో రికార్డ్ అవుతుండగా చూసి షాకైన మహిళ
గత ఏడాది కూడా ఇద్దర్ని పట్టుకున్న పోలీసులు - దొరకకుండా వెళ్లిన వాళ్లు ఎంత మందో ?
అయితే ఇలా జంతువుల్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం ఇదే మొదటి సారి కాదు గత ఏడాదిలో బ్యాంకాక్ నుంచే ఈ అరుదైన యానిమల్స్ ను తీసుకు వచ్చి ఇద్దరు వేర్వేరుగా దొరికిపోయారు. ఇంకా దొరకకుండా వెళ్లిపోయారేమో తెలియదు కానీ ఇంకావీరి వెనక ఏదైనా ముఠా ఉందా అనే దర్యాప్తు చేస్తున్నారు.
హిండన్‌బర్గ్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సెబీ ఛైర్‌పర్సన్, వివాదంపై కీలక స్టేట్‌మెంట్
ఆ జంతువులన్నింటినీ మళ్లీ బ్యాంకాక్‌కు పంపేసిన అధికారులు
ఆ యానిమల్స్ అన్నింటినీ మళ్లీ తిరుగుటపాలో ధాయ్ ల్యాండ్‌కు పంపేశారు కస్టమ్స్ అధికారులు. ఇక్కడ వాటి సంరక్షణ కష్టం కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా అయితే అలీవ్ రిడ్లే తాబేళ్లను భారత్ నుంచి బయట దేశాలకు ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తూంటారు. ఇక్కడ విచిత్రంగా ... భారత్‌లోకే తీసుకు వస్తున్నారు.