Covid Cases In India: 24 గంటల్లో 328 కేసులు, నెమ్మదిగా పెరుగుతున్న బాధితుల సంఖ్య
Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997 కి చేరుకుంది.

Corona Cases in India:
2,997 యాక్టివ్ కేసులు..
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 328 కేసులు (Covid-19 Cases in India) నమోదయ్యాయి. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 2,997 కి పెరిగింది. యూపీలోని నోయిడాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 54 ఏళ్ల వ్యక్తికి టెస్ట్ చేయగా పాజిటివ్‌గా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. టెస్ట్ శాంపిల్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపినట్టు తెలిపారు. Covid-19 JN.1 Variant చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇప్పటికే వైద్యులు హెచ్చరించారు. ప్రస్తుతం కేసులు ఉన్నట్టుండి పెరగడానికి కారణమిదేనని వెల్లడించారు. రాజస్థాన్‌లో నాలుగు JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గోవాలోనూ ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడం వల్ల రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. కొంత మందికి ఏ లక్షణాలు లేకపోయినా వారి నుంచి మరొకరికి సులువుగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లోనూ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఎవరికి ఏ మాత్రం కాస్త లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. అనవసరంగా ఆందోళన చెందొద్దని, బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

