Match 3 - 18 Oct 2021, Mon up next
IRE
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 4 - 18 Oct 2021, Mon up next
SL
vs
NAM
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 5 - 19 Oct 2021, Tue up next
SCO
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 6 - 19 Oct 2021, Tue up next
OMA
vs
BAN
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Hotel Room Marriage : హోటల్‌గదిలో పెళ్లి చేసుకున్నామని లవర్స్ పిటిషన్ - పాతిక వేల ఫైన్ వేసిన హైకోర్టు !

హోటల్ గదిలో పెళ్లి చేసుకున్నామని.. రక్షణ కల్పించాలని ఓ జంట పంజాబ్ -హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం వారికి రూ. 25వేల జరిమానా విధించింది. ఎందుకంటే..?

FOLLOW US: 


" ఇద్దరు ప్రేమికులు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు. ఓ హోటల్ గదిలో రూమ్ తీసుకున్నారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. రెయిడింగ్ జరుగుతుందేమో అని భయపడి అప్పటికప్పుడు కుర్చీ విరగ్గొట్టేసి.. మంట వేసి ఏడు అడుగులు నడిచేస్తారు. అలా పోలీసులు తలుపు తీయగానే ఇలా ఏడో అడుగు వేసేస్తారు. దీంతో పోలీసులు షిట్ అనుకుని .. వారు భార్యభర్తలు అని ఫిక్సయిపోయి అక్కడ్నుంచి వెళ్లిపోతారు.." ... ఇదంతా చదువుతూంటే ఇలాంటి సీన్లు ఉన్న సినిమాలు చాలా చూశానని మీకు గుర్తొచ్చే ఉంటుంది. పాత సినిమాల్లో ఇవి చాలా రొటీన్ సీన్లు. వీటిని చూసి ఇన్‌స్పయిర్ అయ్యారో లేకపోతే నిజంగానే అలాంటి పరిస్థితులు వచ్చాయో కానీ.. పంజాబ్‌కు చెందిన ఓ జంట అచ్చంగా ఇలానే హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కావాలంటూ కోర్టుకెళ్లారు. కానీ అక్కడ సినిమా స్టైల్లో హ్యాపీ ఎండింగ్ రాలేదు. కోర్టు చీవాట్లు పెట్టి రూ. పాతిక వేల ఫైన్ వేసింది.


Also Read : 6 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది ఎప్పుడో తెలుసా!


తాము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ జంట పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఆ సందర్భంగా పెళ్లి చేసుకున్నట్లుగా సాక్ష్యాలు చూపించాలని కోర్టు అడిగింది. అప్పుడు  పెళ్లి కొడుకు అతి తెలివి తేటలు చూపించాడు. తాము హోటల్ గదిలో గ్యాస్ స్టౌవ్ మీద మంట పెట్టి ఏడు అడుగులు నడిచామని.. తాను ఆమె నుదుట సింధూరం దిద్దానని చెప్పుకొచ్చారు. ఇక ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆ పెళ్లి కొడుకు చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. 


Also Read : దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 14,313 మందికి వైరస్


తర్వాత వారి వయసులు తెలుసుకుని మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఆ పెళ్లి కూతురు వయసు ఇరవై ఏళ్లు కాగా.. పెళ్లి కొడుకు వయసు 19 ఏళ్ల ఐదు నెలలు మాత్రమే. అంటే పెళ్లి కొడుక్కి చట్ట ప్రకారం పెళ్లి వయసు రాలేదన్నమాట. వాళ్లిద్దరూ చేసుకున్న పెళ్లి చెల్లుబాటు అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే అతడికి వివాహ వయసు లేకపోవడంతో హైకోర్టు అది చెల్లుబాటు అయ్యే పెళ్లి కాదని తేల్చేసింది. వెంటనే వారికి రూ. పాతిక వేల జరిమానా కూడా విధించింది. అతను మంచి బుద్దితో హైకోర్టును ఆశ్రయించలేదని .. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read : తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?


అయితే పెద్దలు వారి తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉండంతో వారి ప్రాణాలకు ముప్పు ఉందని..  రక్షణ కల్పించాలని.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఆ ప్రేమ జంట ఎలా అయినా తమ పెళ్లి అయిందని నిరూపించాలనుకున్నారు కానీ.,. సినిమా స్టైల్లో వర్కవుట్ కాక ఫైన్ కట్టాల్సి వచ్చింది. 



Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Punjab and Haryana High Court young couple 'saat pheras' around the fire hotel room marrige not a valid marriage ceremony

సంబంధిత కథనాలు

Yuvraj Singh Arrested: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్.. అలా అన్నందుకే!

Yuvraj Singh Arrested: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్.. అలా అన్నందుకే!

Breaking News Live Updates: మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్ట్... బెయిల్ పై విడుదల..!

Breaking News Live Updates: మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్ట్... బెయిల్ పై విడుదల..!

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Jammu Kashmir Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు కూలీలు మృతి

Jammu Kashmir Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు కూలీలు మృతి
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!

MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!

Sree Leela: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!

Sree Leela: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!

Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Chiranjeevi Hand Sugrery: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!

Chiranjeevi Hand Sugrery: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!