Coronavirus Spike: హాట్‌స్పాట్‌లు గుర్తించండి, టెస్టింగ్ సంఖ్య పెంచండి - రాష్ట్రాలకు కేంద్రం సూచన
Coronavirus Spike: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలతో సమావేశమైంది.
![Coronavirus Spike: హాట్‌స్పాట్‌లు గుర్తించండి, టెస్టింగ్ సంఖ్య పెంచండి - రాష్ట్రాలకు కేంద్రం సూచన Coronavirus Union Health Minister Mansukh Mandaviya Review Meeting States Prepration Public Awareness Coronavirus Spike: హాట్‌స్పాట్‌లు గుర్తించండి, టెస్టింగ్ సంఖ్య పెంచండి - రాష్ట్రాలకు కేంద్రం సూచన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/07/78d3753326ebb29369532695e70c1f001680862095222517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Spike:
మన్‌సుఖ్ మాండవీయ మీటింగ్..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లోని వైరస్ వ్యాప్తిపై ఆరా తీశారు. కొవిడ్ టెస్ట్‌లతో పాటు, జీనోమ్ సీక్వెన్సింగ్ గురించీ ప్రస్తావించారు మన్‌సుఖ్ మాండవీయ. ఎవరూ ఆందోళన చెందకూడదని, అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు రివ్యూ మీటింగ్‌లు నిర్వహించాలని తెలిపారు. ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయాలని తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు అడగగా...అందుకు మాండవీయ అనూహ్యంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని కొనుగోలు చేసుకోవాలని చెప్పారు.
"ఇప్పుడు మనమంతా అప్రమత్తంగా ఉండాలి. అనవసరపు భయాలు పెట్టుకోవద్దు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు రివ్యూ మీటింగ్ నిర్వహించాలి. మౌలిక వసతులు ఎలా ఉన్నాయో సమీక్షించుకోవాలి. ఆ మేరకు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి. అన్ని ఆసుపత్రులనూ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. హాట్‌స్పాట్‌లు గుర్తించడమే కీలకం. అలాంటి చోట్ల టెస్టింగ్ సంఖ్యను పెంచాలి. "
- మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి
Chaired a meeting to review COVID-19 situation with the Health Ministers of the States & Union Territories. Stressed on increasing covid testing & genome sequencing along with following COVID appropriate behaviour.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 7, 2023
We have to be alert & avoid spreading any unnecessary fear. https://t.co/VdHazObxTS
పలు రాష్ట్రాలు అలెర్ట్...
దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే...ఢిల్లీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఈ జాబితాలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు కీలక ఆదేశాలిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్ సింగ్ కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా సోకిన వాళ్లెవరూ ICUలో లేరని స్పష్టం చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది.
Also Read: Twitter Logo: మరోసారి ట్విటర్ లోగో మార్చిన మస్క్, కుక్క స్థానంలోకి మళ్లీ పిట్ట వచ్చేసింది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)