By: Ram Manohar | Updated at : 29 Dec 2022 12:35 PM (IST)
కొవిడ్ సోకిన అర్జెంటీనా పర్యాటకుడు కనిపించకుండా పోయాడు.
Covid Patient Missing:
అర్జెంటీనా పర్యాటకుడికి పాజిటివ్..
తాజ్‌మహల్ సందర్శనకు వచ్చిన అర్జెంటీనా పర్యాటకుడికి కరోనా టెస్ట్ చేయగా...పాజిటివ్‌గా తేలింది. డిసెంబర్ 26న కొవిడ్ పాజిటివ్ అని తేలగా...అప్పటి నుంచి ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. తాజ్‌మహల్ సందర్శనకు వచ్చిన వారందరికీ కొవిడ్ టెస్ట్‌లు తప్పని సరి చేశారు. అర్జెంటీనా పర్యాటకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాక...లోపలకు అనుమతించలేదు. ఆ సమయంలో అక్కడి అధికారులువ్యక్తిగత సమాచారం అడగ్గా..తప్పుడు వివరాలు ఇచ్చినట్టు వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని గాలిస్తున్నారు. "డిసెంబర్ 26న అర్జెంటీనా పర్యాటకుడికి కొవిడ్ నిర్ధరణైంది. యాంటీజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిన వెంటనే అతని వ్యక్తిగత వివరాలు అడిగాం. కానీ...ఆ కాంటాక్ట్ డిటెయిల్స్ తప్పు అని తరవాత తెలిసింది. ప్రస్తుతం అతణ్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే స్థానిక పోలీసులు, అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చాం" అని వైద్యులు వెల్లడించారు. అంతకు ముందు రోజు..అంటే డిసెంబర్ 25న చైనా నుంచి వచ్చిన పర్యాటకుడికి కొవిడ్ నిర్ధరణ అయింది. "కొద్ది రోజుల క్రితం చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన పర్యాటకుడిని గుర్తించి టెస్ట్ చేశాం. అతడికీ పాజిటివ్‌గా నిర్ధరణైంది. వైరస్ శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాం. చైనా నుంచి వచ్చాడు కనుక..జీనోమ్ సీక్వెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. అతడినీ ట్రేస్ చేస్తున్నాం. ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఒకే గదిలో ఉన్నాడని, పెద్దగా బయటకు రాలేదని తెలుస్తోంది" అని అధికారులు తెలిపారు.
కఠిన ఆంక్షలు..
భారత్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లోనూ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే... ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద అలెర్ట్ జారీ చేశారు. పెద్ద మొత్తంలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయాలని జిల్లా ఆరోగ్యాధికారి వెల్లడించారు. "ఇప్పటికే ఆరోగ్య విభాగానికి చెందిన అధికారులు కొవిడ్ టెస్ట్‌లు చేయడం మొదలు పెట్టారు. వీలైనంత వరకూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి నుంచి సందర్శకులందరికీ కొవిడ్ టెస్ట్ తప్పనిసరి చేస్తాం" అని స్ఫష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రకటన చేసింది. వైరస్ వ్యాపించకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కోమోర్బిడిటిస్‌తో బాధపడే పెద్దవాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్ డోసులు తీసుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. తమిళనాడు, కేరళ తరవాత బెంగళూరులోనూ కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అబుదాబి, హాంగ్‌కాంగ్, దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్ టెస్ట్ చేయగా...పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురి వైరస్ శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు.
Also Read: Cough Syrup Death: దగ్గు మందు తాగిన 18 మంది చిన్నారులు మృతి! అప్రమత్తమైన కేంద్రం
Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే
ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!