అన్వేషించండి

Coronavirus China: కొవిడ్ లెక్కలు దాచేస్తున్న చైనా, ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO

Coronavirus China: కొవిడ్ డేటాని చైనా దాస్తుందోనని WHO ఆందోళన వ్యక్తం చేసింది.

 China Covid Data:

డేటా సరిగా లేదు: WHO

చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం కొవిడ్ బాధితుల సంఖ్యను చాలా తక్కువగా చూపిస్తోంది. మొదటి నుంచి కరోనా లెక్కలను సరిగా వెల్లడించకుండా దాస్తోంది చైనా. ఇప్పుడు కూడా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కారణంగా చైనాలో భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ...చైనా మాత్రం అదేం లేదంటూ తప్పుడు లెక్కలు బయట పెడుతోంది. చైనాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 97% మేర ఈ కొత్త వేరియంట్‌ కారణంగా వచ్చినవే. అయితే.. చైనా కొవిడ్ కేసుల విషయంలో ఇస్తున్న సమాచారం సరిగా ఉండడం లేదని WHO తేల్చి చెప్పింది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్‌లను మాత్రమే ఇస్తోందని, మ్యుటేషన్‌లు, వేరియంట్‌లు, కొవిడ్ కేసుల సంఖ్య లాంటి వివరాలను అందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే WHO ప్రతినిధులు చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ వేరియంట్‌ ఎక్కువగా సోకుతోంది..? ఆసుపత్రుల్లో సరిగా చికిత్స అందుతోందా లేదా..? జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా కొనసాగుతోంది..? ఇలా అన్ని విషయాలనూ ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. "ఈ వివరాలు కచ్చితంగా ఉంటేనే కరోనాపై పోరాడం సులువవుతుంది" అని WHO స్పష్టం చేసింది. పలు దేశాల్లో ఈ  డేటా సరిగ్గా ఉండటం వల్ల కొంత వరకూ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలైందని గుర్తు చేసింది. దాదాపు మూడేళ్లుగా చైనాలో కరోనా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ...పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని వెల్లడించింది. 

ఆరంభం మాత్రమే..

ఇదంతా ఆరంభం మాత్రమేనని...అసలు కథ ముందుందని అంటున్నారు నిపుణులు. మరి కొద్ది రోజుల్లో ఇంత కన్నా దారుణమైనపరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరో 13 రోజుల పాటు కరోనా కేసులు ఉన్నట్టుండి పెరిగిపోతాయని చెబుతున్నారు. అంతే కాదు. గత రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో కేసులు నమోదవుతాయట. యూకేలోని ఆరోగ్య రంగ నిపుణులు చైనాలో ఏ స్థాయిలో కేసులు 
నమోదవుతాయో అంచనా వేస్తున్నారు. జనవరి 13వ తేదీన కరోనా అనూహ్య స్థాయిలో వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. అప్పటికి కరోనా బాధితుల సంఖ్య 37 లక్షలకు పెరుగుతుందని, అక్కడి నుంచి మరింత వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. జనవరి 23వ తేదీ నాటికి రోజుకు 25 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతారని సంచలన అంచనాలు వెలువరించారు ఎక్స్‌పర్ట్‌లు. ఇదే నిజమైతే...చైనా వణికిపోవడం ఖాయం. ఇప్పటికే అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. నిపుణులు చెప్పినట్టుగా కేసులు ఆ స్థాయిలో పెరిగితే అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఊహించు కోడానికి కూడా భయంగానే ఉంది. సరైన వైద్యం దొరక్క ఇప్పటికే అల్లాడిపోతున్నారు. 

Also Read: US Utah Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, 8 మంది మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Reel Mad: తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్
తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్
Sanjay Bangar son now woman: అమ్మాయిగా మారిపోయిన సంజయ్ బంగర్ కుమారుడు - బిడ్డకు కూడా జన్మనిచ్చేలా ప్రణాళిక
అమ్మాయిగా మారిపోయిన సంజయ్ బంగర్ కుమారుడు - బిడ్డకు కూడా జన్మనిచ్చేలా ప్రణాళిక
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Best Mileage CNG cars: ట్రాఫిక్‌లోనూ అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే.. వాటి ధర, మైలేజీ చూసి తీసుకోండి
ట్రాఫిక్‌లోనూ అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే.. వాటి ధర, మైలేజీ చూసి తీసుకోండి

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
Ugadi 2026: ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Embed widget