అన్వేషించండి

Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, 24 గంటల్లో 6,660 కేసులు నమోదు!

Corona Cases: గత రెండ్రోజులుగా కాస్త కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 6660 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 

Corona Cases: గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం కంటే ఈరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 శాతం తగ్గింది. దీంతో గడిచిన 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 6660 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచి 24 గంటల్లో 24 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5 లక్షల 31 వేల 369కి పెరిగింది. అలాగే ప్రస్తుతం భారత్ లో రోజువారీ సానుకూలత రేటు 3.52 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ  శాఖ డేటా వెల్లడించింది. 

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా

మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల బృందం రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోగ్యాన్ని పరిశీలించారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఢిల్లీలో Indian Air Force Commanders కాన్ఫరెన్స్‌కు రాజ్‌నాథ్ సింగ్ హాజరవ్వాల్సి ఉంది. కానీ కరోనా సోకడం వల్ల ఆయన వెళ్లడం లేదు. గతేడాది జనవరిలోనూ ఆయనకు కరోనా సోకింది. ఒమిక్రాన్ వేరియంట్ బాగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలున్నాయని అప్పట్లో ట్వీట్ చేశారు రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతానికి XBB.1.16 వేరియంట్‌ వ్యాప్తి చెందుతోందని వైద్యులు వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు సోకిన వేరియంట్‌ కూడా ఇదేనా కాదా అన్నది ధ్రువీకరించాల్సి ఉంది. 

తాజాగా పెరుగుతున్న కేసులకు కారణం ఒమిక్రాన్ XBB.1.16  వేరియంట్. దీన్నే ఆర్కుట్‌రస్ అని పిలుస్తారు. మహమ్మారి కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశానికి ఈ కొత్త వేరియంట్ వల్ల మళ్లీ భయాంధోళనలు మొదలయ్యాయి. ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మళ్లీ  జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్కుట్‌రస్ వేరియంట్ వ్యాప్తి వేగం అధికంగానే ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ఇది యువత, పిల్లలను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. మనుషుల్లోని రోగనిరోధక శక్తిని తట్టకునే లక్షణాలను కూడా ఇది చూపిస్తోంది. 
 
లక్షణాలు ఇలా...

మ్యుటేషన్ చెందుతున్న కరోనా వైరస్ అన్ని వేరియంట్లు ఒకేలాంటి లక్షణాలను చూపిస్తున్నాయి. 

1. జ్వరం ఎక్కువ కాలం పాటూ వేధించడం
2. ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం
3. గొంతు మంట
4. కండ్ల కలక
5. తలనొప్పి
6. తీవ్ర అలసట
7. కండరాలు నొప్పి

పైన చెప్పిన లక్షణాలన్నీ దాదాపు ముందు వేరియంట్లతో కలిగేవే. అయితే కొత్తగా ఇందులో చేరినది పింక్ ఐ (కండ్ల కలక). పింక్ ఐ, కోవిడ్-19తో ఎలా సంబంధం కలిగి ఉంటుందనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు. దీనికి ఎక్కువ పరిశోధన అవసరం. ఇది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో బయటపడుతున్న లక్షణం. 

జాగ్రత్తలు ఇలా...

1. మునుపటిలాగే బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి. 
2. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు. 
3. హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా వాడాలి.
4. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
5. బూస్టర్ షాట్ తీసుకోవాలి. 
6. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను రోజూ తీసుకోవాలి. 

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget