Congress President Election Result: కాంగ్రెస్ కెప్టెన్ ఎవరో తేలేది ఇవాళే, కొనసాగుతున్న కౌంటింగ్
Congress President Election Result: కాంగ్రెస్‌కు సారథి ఎవరో నేడు కౌంటింగ్ తరవాత తేలనుంది.
Congress President Election Result:
సీనియర్ నేతలు ఢిల్లీకి..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ ఇటీవలే ముగిసింది. దాదాపు 9,500 మంది కాంగ్రెస్ నేతలు.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు ఈ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే ఈ పోటీలో ఉన్నారు. వీరిలో ఖర్గేనే విజయం వరిస్తుందని ముందు నుంచి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 24 ఏళ్ల తరవాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారు. ఢిల్లీలోని AICC కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రంలోగా ఫలితాలు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ బాక్స్‌లతో పాటు కకీలక నేతలందరూ ఢిల్లీకి చేరుకున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కూడా ఎన్నిక ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఢిల్లీకి రానున్నట్టు సమాచారం. గాంధీ కుటుంబం నుంచి ఈ సారి ఎవరూ పోటీలో లేరు.
22 ఏళ్ల క్రితం..
కాంగ్రెస్ చరిత్రలో 22 ఏళ్ల క్రితం గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. జితేంద్ర ప్రసాద్, సోనియా గాంధీకి పోటీకా ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. అప్పుడు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఆమే ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్లకు ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌కు ఎక్కువ కాలం అధ్యక్షత వహించిన నేత సోనియా గాంధీయే. కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక జరగటం ఇది ఆరోసారి. 2017లో జరిగిన ఎన్నికలో..రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. "పార్టీలో సమూల మార్పులుతీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. మల్లికార్జున్ ఖర్గే చాలా సీనియర్ నేత. ఒకవేళ ఆయన గెలిస్తే పరస్పర సహకారంతో ముందుకెళ్తాం" అని శశిథరూర్ స్పష్టం చేశారు. "BJP,RSS ఐడియాలజీకి వ్యతిరేకంగా పోరాటం చేయటం, పార్టీలో మార్పులు తీసుకురావటం నా బాధ్యత. భాజపా దేశాన్ని మతాల వారీగా విడదీస్తోంది. వెనకబడిన వర్గాల్లోనూ చిచ్చు పెడుతోంది. అన్ని ఎన్నికల దృష్టిలోనే చూస్తుండటం వల్లే ఈ సమస్యలు" అని వ్యాఖ్యానించారు మల్లికార్జున్ ఖర్గే.
అధిష్ఠానం ప్రభావం ఉండదా..?
ఈ ఇద్దరు నేతలూ మొదటి నుంచి ఒకే విషయం చెబుతున్నారు. "మా ఎన్నికపై అధిష్ఠానం ప్రభావం ఏమీ ఉండదు" అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే...పార్టీ ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే వారికే ఆ పదవి కట్టబెడతారు తప్ప...ప్రత్యేకించి గాంధీ కుటుంబం ఎవరినీ ప్రతిపాదించదు. ఎవరిపైనాపక్షపాతం ఉండదని చెబుతున్నా...శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త సంచలనమయ్యాయి. భారత్ జోడో యాత్రలో మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ నేతలందరూ ఆహ్వానించి ఆయనతో మాట్లాడారని, తనను మాత్రం పెద్దగా పట్టించుకోలేదని ఘాటైన కామెంట్స్ చేశారు థరూర్. అటు ఖర్గే మాత్రం "అధిష్ఠానం ఆదేశాల మేరకే నడుచుకుంటా. అది ఏ నిర్ణయమైనా సరే" అని స్పష్టం చేశారు. అంతే కాదు. పార్టీ నేతల మద్దతు కోరడం తన విధి అని వెల్లడించారు. అసలు ఈ పోటీలో ఎవరుంటారన్నది చివరి నిముషం వరకూ ఉత్కంఠగానే సాగింది. ఎన్నో మలుపులు తిరిగి...ఖర్గే, థరూర్ పేర్లు ఖరారయ్యాయి.
Also Read: Iran Schoolgirl Death: పాట పాడలేదని బాలికను స్కూల్‌లోనే కొట్టి చంపారు, ఇరాన్‌లో దారుణం