అన్వేషించండి

Jagan Sharmila: షర్మిల కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు జగన్ - ఫోటోలో అన్నకు దూరంగానే చెల్లెలు

CM Jagan News: హైదరాబాద్ శివారు గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది.

Raja Reddy with Priya Atluri Engagement Ceremony: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ శివారు గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. ఈ వేడుకకు జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. వేడుక వద్దకు రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం జగన్‌ దంపతులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయల్దేరి సీఎం జగన్, భారతి రెడ్డి దంపతులు రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

అయితే, వైఎస్ జగన్ కాబోయే వధూవరుల వద్దకు వచ్చి ఆశీర్వదిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫోటో దిగే సందర్భంలో జగన్ తన బావ బ్రదర్ అనిల్ ను, సోదరి షర్మిలను తన పక్కకు పిలుస్తుండగా.. వారు రాలేదు. జగన్ పదే పదే తన పక్కకు రావాలని సైగ చేస్తున్నప్పటికీ షర్మిల అక్కడికి వెళ్లలేదు. దీంతో షర్మిల, బ్రదర్ అనిల్ దూరంగా ఉంటూ ఫోటోల్లో కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కానీ, జగన్ వేదిక వద్దకు వచ్చిన సందర్భంలో మాత్రం.. షర్మిల ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఈ ఫోటోలు బయటికి వచ్చాయి.

Jagan Sharmila: షర్మిల కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు జగన్ - ఫోటోలో అన్నకు దూరంగానే చెల్లెలు

గండిపేటలో నిశ్చితార్థం
గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం జరిగింది. రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ అండ్ ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ ప‌ట్టా కూడా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో రాజా రెడ్డికి గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. వారు అప్పటి నుంచే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వారి మతాలు వేరు అయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించారు. అలా నేడు గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17న వీరి వివాహం జరగనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget