అన్వేషించండి

Chittoor News: చోరీ అయిన 500 ఫోన్లు రికవరీ, మీ మొబైల్ పోతే ఇలా కంప్లైంట్ ఇవ్వండి

Chittoor News: చోరీకి గురైన కోటి రూపాయల విలువ చేసే 500 ఫోన్లు చిత్తూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లనూ స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు.

Chittoor News: ఫోన్లు పోవడం, చోరీకి గురికావడం చాలా సాధారణం. ఆ పోయిన ఫోన్లు దొరక్కపోవడం కూడా అంతే సాధారణం. ఫోన్ పోతే ఒకటీ రెండు చోట్ల వెతుకుతారు. దొరికిందా సరేసరి లేదంటే తూర్పు వైపు తిరిగి దండం పెడుతుంటారు చాలా మంది. అంటే ఇక ఆ ఫోన్ దొరకదని ఊరుకుంటారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయరు. అందులో ఉన్న ఫోటోలు, ఇతర డేటా కోసం బాధపడుతుంటారు. టెక్నాలజీ తెలిసిన వారు, ఫోన్లలోని ఆప్షన్లపై అవగాహన ఉన్న వారు ఆ ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయడం లాంటివి చేస్తుంటారు. డేటా దుర్వినియోగం కాకుండా ఎరేజ్ చేస్తుంటారు. కానీ పోయిన ఫోన్ కోసం పోలీసు కంప్లైంట్ ఇవ్వరు, దాని కోసం వెతకరు. సెల్ ఫోన్ పోగొట్టుకుని లేదా చోరీకి గురైన ఇక ఆశలన్నీ వదులుకున్న వారికి చిత్తూరు జిల్లా పోలీసులు అదిరిపోయే న్యూస్ చెప్పారు. 

చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను   రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఆయా ఫోన్లు బాధితులకు అందజేసారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో మొబైల్ రికవరీ మేళా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులకు ఫోన్లు ఇచ్చారు. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

దొరకవు అనుకున్న ఫోన్లు దొరికాయి

ఆధునిక సాంకేతికత సాయంతో మొబైల్ ఫోన్ దొంగలు ఆట కట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఐదు వందలకు పైగా ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అందజేశారు. చిత్తూరు జిల్లాలో కొట్టేసిన ఫోన్లు జమ్మూ కశ్మీర్ లో ఉన్నప్పటికీ లేటెస్ట్ చాట్ బాట్ టెక్నాలజీ ఉపయోగించి గుర్తించినట్టు ఎస్పీ విశ్వంత్ రెడ్డి తెలిపారు.  కొన్ని కేసుల్లో భాదితుల ఫిర్యాదు అందిన 4 గంటల లోపు మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇతర  రాష్ట్రాలు, జిల్లాల నుండి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేశారు చిత్తూరు పోలీసులు. ఇక దొరకవు అన్న ఫోన్లు మళ్ళీ తమ కళ్ళ ముందు కనిపించేటప్పటికి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ విశ్వంత్ రెడ్డి అభినందించారు. ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసుల “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితులు మళ్లీ పొందవచ్చునని తెలిపారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. 

చాట్ బాట్‌కు వివరాలు ఇలా పంపించాలి

ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help టెక్ట్స్ మెసేజ్ పంపాలి. తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. జిల్లా, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్ట్ నంబర్, మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. తర్వాత ఆ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చాట్ బాట్ బృందం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget