News
News
X

Kissing Device: గర్ల్‌ఫ్రెండ్ దూరంగా ఉన్నా ముద్దు పెట్టేయొచ్చు,యూత్‌కి కిక్ ఇస్తున్న కిస్సింగ్ డివైజ్

Kissing Device: చైనాలోని ఓ యువకుడు కిస్సింగ్ డివైజ్‌ను కనిపెట్టాడు.

FOLLOW US: 
Share:

Kissing Device in China: 

కిస్సింగ్ డివైస్..

చైనాలోని ఓ యూనివర్సిటీ ఓ డివైజ్ కనిపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. దాని పేరేంటో తెలుసా..? "Kissing Device". దూరంగా ఉన్న ప్రేమికుల కోసం తయారు చేసిందే ఈ పరికరం. వర్చువల్‌గా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌కి సిలికాన్ లిప్స్‌ అమర్చారు. వీటికి ప్రెజర్ సెన్సార్లు పెట్టారు. వాటిని ముద్దు పెట్టుకుంటే నిజంగా "కిస్" ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చైనాలోని గ్లోబల్ టైమ్స్‌ ఈ డివైజ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ముద్దు పెట్టుకున్నప్పడు ఉండే ప్రెజర్‌తో పాటు టెంపరేచర్‌నూ ఫీల్ అయ్యేలా తయారు చేశారీ పరికరాన్ని. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భలే ఫన్నీగా ఉందే అని కొందరు కామెంట్ పెడుతుంటే...మరి కొందరు ఇదేం డివైజ్ అంటూ పెదవి విరుస్తున్నారు. మైనర్లు కూడా వీటిని కొనుగోలు చేసి వినియోగించే ప్రమాదముందని మండి పడుతున్నారు. 

ఎలా కిస్ చేయాలి..? 

ఈ వర్చువల్ కిస్‌ను ఫీల్ అవ్వాలంటే ముందు ఓ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరవాత ఛార్జింగ్ పోర్ట్‌కు కేబుల్‌తో ఈ డివైజ్‌ను కనెక్ట్ చేయాలి. పార్ట్‌నర్‌తో పెయిర్ అవ్వాలి. ఆ తరవాత వీడియో కాల్ చేసుకుని ముద్దు ముద్రలు వేసుకోవచ్చు. దీన్ని ఆవిష్కరించిన జియాంగ్ జోంగ్లీ ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉన్నప్పుడు కేవలం ఫోన్‌లో మాత్రమే టచ్‌లో ఉన్నానని, అప్పుడే ఈ ఐడియా తట్టిందని వివరించారు. 2016లో  మలేషియాలో Imagineering Institute ఇదే తరహా పరికరం తయారు చేసింది. దాని పేరు "Kissinger".టచ్ సెన్సిటివ్ సిలికాన్ ప్యాడ్‌ రూపంలో దీన్ని రూపొందించింది. అయితే...చైనాలో తయారైన కొత్త డివైజ్‌తో తెలియని వ్యక్తులతోనూ పెయిర్ అయ్యి ముద్దులు పెట్టేయొచ్చు. ముద్దు ముద్రల్ని యాప్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. పార్ట్‌నర్‌ ఆ కిస్‌ని డౌన్‌లోడు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ డివైజ్ ధర 288 యువాన్లు. అంటే మన కరెన్సీలో రూ.3,433. 

Also Read: Ideas of India 2023: మన ప్రొడక్టే మన సక్సెస్‌ని నిర్ణయిస్తుంది, మార్కెటింగ్ వ్యూహం చాలా ముఖ్యం - ఎస్‌బీఎస్‌ గ్రూప్ ఫౌండర్ సంజీవ్ జునేజా

Published at : 25 Feb 2023 05:10 PM (IST) Tags: Kissing Kissing Device China University Remote Kissing

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్