Cheetah Relocation Plan: ఇకపై భారత్‌లో చీతాల గాండ్రింపు, ప్రధాని మోదీ చేతుల మీదుగా నేషనల్ పార్క్‌లోకి
Cheetah Relocation Plan: దాదాపు 50 ఏళ్ల సంప్రదింపుల తరవాత భారత్‌కు చీతాలు వస్తున్నాయి.
Cheetah Relocation Plan:
ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో..
నమీబియా నుంచి వచ్చి 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి అధికారికంగా వదలనున్నారు. స్పెషల్ ప్లేన్‌లో వచ్చిన చీతాలను ప్రత్యేకంగా తయారు చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్స్‌లో ఉంచనున్నారు. రెండు మగ చీతాలను ఈ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. ఆడ చీతాని పక్కనే మరో ఎన్‌క్లోజర్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 8 చీతాల కోసం ఆరు పెద్ద ఎన్‌క్లోజర్‌లు అరేంజ్ చేశారు. "Action Plan for Introduction of Cheetah in India"లో భాగంగా...కేంద్రం ఈ చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి రప్పించింది. ఇప్పటికే వీటికి వ్యాక్సిన్‌లు వేశారు. వాటికి సాటిలైట్ కాలర్‌లు కూడా అమర్చారు. ఇండియాలో చీతాల గాండ్రింపులు మరోసారి వినపడాలన్న లక్ష్యంతో...ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది కేంద్రం. అయితే...ఇదేమంత సులువుగా అయిపోలేదు. దాదాపు 50 ఏళ్ల సంప్రదింపుల తరవాత ఈ కల సాకారమైంది.
Fulfilling the commitment towards Mission LiFE, India welcomes back the fastest land animal, the Cheetah! The big cats are set to arrive on 17th September from South Africa #CheetahIsBack pic.twitter.com/P33T8CnoCw
— MyGovIndia (@mygovindia) September 12, 2022
1. 1952లో భారత్‌లో తొలిసారి వైల్డ్‌లైఫ్ బోర్డ్ మీటింగ్ (Wildlife Board Meeting) జరిగింది. చిరుతల సంఖ్య దారుణంగా పడిపోయిందని గుర్తించింది అప్పుడే. వెంటనే భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
2. 1972లో అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ..ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టారు. ఆసియా చీతాలను భారత్‌కు రప్పించి అందుకు బదులుగా ఆసియా సింహాలను ఇచ్చేలా సంప్రదింపులు జరిగాయి. ఆ తరవాత కొన్ని రోజుల పాటు చర్చలు ఆగిపోయాయి.
3. 2009లో చర్చలు పున:ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు చొరవ చూపించారు. కానీ...ఎందుకో ఆ ప్రయత్నం ఫలించలేదు.
4. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో మొత్తానికి ఈ ప్లాన్ సక్సెస్ అయింది. సెప్టెంబర్ 17వ తేదీన చీతా భారత్‌లోకి రానుంది.
కునో పల్‌పూర్ నేషనల్ పార్క్..
ఈ పార్క్‌లో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీ సెల్సియస్. శీతాకాలంలో 6-7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతానికి ఈ నేషనల్ పార్క్‌లో 21 చీతాలు మనుగడ సాగిస్తున్నాయి. కనీసం 36 చీతాలు ఇక్కడ ఉండేందుకు అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. మొత్తం 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ నేషనల్ పార్క్. కొత్తగా వస్తున్న చీతాలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా రెండు అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు.
సక్సెస్ అయిందని ఎలా నిర్ధరిస్తారు..?
నేషనల్ పార్క్‌లోకి వదిలిన చీతాల్లో 50% మేర మనుగడ సాధించగలిగితే...అప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు లెక్క. పునరుత్పత్తి జరిగాక...వాటి పిల్లలు కనీసం ఏడాది పాటు ఆరోగ్యంగా మనుగడ సాగించగలిగినా విజయం సాధించినట్టే. ఈ చీతాలు భారత్‌కు రావటంపై కాంగ్రెస్ స్పందించింది. ఈ "Project Cheetah" 2008-09లోనే తామే ప్రవేశపెట్టామని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు ఆమోదం తెలిపారని గుర్తు చేసింది. 2013లో సుప్రీం కోర్టు స్టే విధించడం వల్లే అప్పట్లో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని వెల్లడించింది. 2020లో సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలపటం వల్లే ఇప్పుడు వాటిని భారత్‌కు తీసుకురావటం సాధ్యమైందని వివరిస్తోంది.