Chandrayaan-3: చంద్రయాన్ 3 సక్సెస్‌పై పాక్ మీడియా ప్రశంసలు, అద్భుతం అంటూ కితాబు
Chandrayaan-3: చంద్రయాన్ సక్సెస్‌పై పాకిస్థాన్ మీడియా ప్రశంసలు కురిపించింది.
Chandrayaan-3:
అద్భుతం అన్న పాక్..
చంద్రయాన్ 3 సక్సెస్ ప్రపంచదేశాలను మన వైపు చూసేలా చేసింది. ఎంతో కష్టం అనుకున్న సౌత్‌పోల్‌పైనే సాఫ్ట్ ల్యాండింగ్ అవడం అన్ని దేశాలనూ ఆశ్చర్యపరిచింది. దాయాది దేశం పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా అక్కడి మీడియాలోనూ చంద్రయాన్ 3 కి సంబంధించిన వార్తల్ని ఎక్కువగా ఇచ్చారు. మాజీ మంత్రులు, న్యూస్ యాంకర్‌లు ఇస్రోని అభినందించారు. పాకిస్థాన్‌లోని Geo News చంద్రయాన్‌ని బాగా కవర్ చేసింది. అంతే కాదు. తమ దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటోందో ప్రస్తావిస్తూనే ఇండియా సక్సెస్ గురించి చెప్పింది. జియో న్యూస్ ఛానల్ యాంకర్స్ కామెంట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షో హోస్ట్‌లు హ్యూమా అమీర్ షా, అబ్దుల్లా సుల్తాన్ భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న తేడాలేంటో చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ ఇద్దరు యాంకర్‌లు. "ఇండియా చందమామ వరకూ వెళ్లింది. మనం మాత్రం మధ్యలోనే ఆగిపోయాం" అని సొంత దేశ దుస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. మన దారుల్ని మనమే వేసుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు. భారత్, పాక్ మధ్య ఉన్న వైరాన్ని అనుకూలంగా మలుచుకుని అంతరిక్ష ప్రయోగాల్లో రెండు దేశాలూ పోటీ పడాలని అన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అవడాన్ని "అద్భుతం" అని ప్రశంసించారు. ఈ విజయంపై తాము ఎంతో సంతోషంగా ఉన్నట్టు వెల్లడించారు. "ఈ వార్త విని మాకు చాలా సంతోషం కలిగింది" అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్రీ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవలే చంద్రయాన్ 3 సక్సెస్‌పై యూకే జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ప్రస్తావిస్తూ క్రికెట్ అనలిస్ట్ మోషిన్ అలీ తీవ్రంగా మండి పడ్డారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
Kaam aisa karo ki dushman bhi taarif kre. pic.twitter.com/dUIZJC5xLI
— Zaira Nizaam 🇮🇳 (@Zaira_Nizaam) August 25, 2023
మస్క్ ట్వీట్...
చంద్రయాన్ 3 సక్సెస్ అయిన నేపథ్యంలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ‘గుడ్ ఫర్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశారు. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన హలీవుడ్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్’ బడ్జెట్‌తో పోల్చడంపై స్పందించారు.చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి న్యూస్‌థింక్ అనే ట్విటర్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. భారత చంద్రయాన్ 3 ప్రయోగం బడ్జెట్ ను హాలీవుడ్ మూవీ ‘ఇంటర్ స్టెల్లార్’ బడ్జెట్ తో పోల్చారు. హాలీవుడ్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’ నిర్మాణం కోసం 165 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1365 కోట్లు) కాగా, కేవలం 75 మిలియన్ డాలర్లు (రూ.620 కోట్లు) బడ్జెట్‌తో ఇస్రో చంద్రయాన్ 3ని ప్రయోగించిందని ఆ ట్వీట్ లో వెల్లడించారు. చంద్రయాన్ 3 బడ్జెట్ ‘ఇంటర్ స్టెల్లార్’ మూవీ బడ్జెట్ కంటే తక్కువ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది” అని సదరు ట్వీట్ లో వెల్లడించారు. ఈ ట్వీట్ కు మస్క్ స్పందించారు. ‘గుడ్ ఫర్ ఇండియా’ అని మస్క్ స్పందించారు.