అన్వేషించండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి- బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు!

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.

మరి కొన్ని నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని దృష్టిలో పెట్టుకున్న బీజేపీక పార్టీలో కీలక మార్పులు చేయబోతోంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమయంలో రాష్ట్రాల్లోని అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ, గజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చబోతోంది. ఈ రాష్ట్రాల బాధ్యతలను పార్టీ కొత్త వారికి అప్పగించవచ్చు. జి.కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా, సునీల్ జాఖర్ ను పంజాబ్ అధ్యక్షుడిగా, అశ్వత్ నారాయణ్ లేదా శోభాకు కర్ణాటక అధ్యక్షులుగా నియమించవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో ఎన్నికల మధ్యప్రదేశ్‌లో కీలక నేతలు బాధ్యతలు అప్పగించవచ్చు.

తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి గతంలో కూడా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు  మంచి మార్కులే ఉన్నప్పటికీ తెలంగాణలో వస్తున్న రాజకీయ పరిణామాలతో ఆయన్ని మార్చాల్సి వస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. బండి సంజయ్‌ను మారుస్తారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన బీజేపీ నాయకులు కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. అదే టైంలో బండి సంజయ్‌ కూడా హన్మకొండలో జరిగిన సమావేశంలో కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 8న జరిగే ప్రధాని బహిరంగ సభకు అధ్యక్ష హోదాలో వస్తానో రానో అంటూ ఎమోషన్ అయ్యారు. దీంతో ఆయన మార్పు ఖాయమని పార్టీ వర్గాలు కన్ఫామ్ చేసుకున్నాయి. 

కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత ఇప్పుడు ఆ పార్టీ మేధోమథనంలో నిమగ్నమైంది. ప్రతిపక్ష నేత పేరుపై కూడా పార్టీ సస్పెన్స్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిపక్ష నేత లేకుండానే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతోంది. మాజీ సీఎం, సీనియర్ నేత యడ్యూరప్పను ఢిల్లీకి పిలిపించి అమిత్ షా కలిశారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి నివేదికను కూడా కేంద్ర నాయకత్వానికి ఆయన అందజేశారు. ఇన్నిరోజుల మధనం తర్వాత పార్టీ పగ్గాలు కొత్త వ్యక్తి చేతికి అప్పగించవచ్చు.

ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో పార్టీ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించింది. ప్రధాని మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో బలంగా ఉండి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయగల నాయకుడికి పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. 

Also Read: తెలంగాణ బీజేపీకి బిగ్ మండే- ఢిల్లీకి రావాలని బండికి పిలుపు- సాయంత్రం కిషన్ రెడ్డి కీలక ప్రెస్‌మీట్

Also Read: కార్యకర్తల భేటీలో బండి సంజయ్‌ భావోద్వేగం - తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఖాయమైనట్టేగా!

 Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget